వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువత కోసం ఈనెల 12వ తేదీన వరంగల్ ములుగురోడ్డు సమీపంలోని ఐటీఐ గర్ల్స్ క్యాంపస్ మినీజాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు వరంగల్ ఉపాధి కల్పన అధి కారి ఉమారాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈమేళాలో హెచ్‌డీఎఫ్‌సీ, యస్‌బ్యాంక్, ముత్తూట్ ఫైనాన్స్, శ్రీరామ్ లైఫ్ ఇన్సూ రెన్స్ కంపెనీలు పాల్గొంటాయన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో హాజరుకావాలన్నారు. హెచ్‌డీఎఫ్‌సీ, ముత్తూట్(7093168464), శ్రీరామ్ లైఫ్(98010 27897)నంబర్లను సంప్రదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment