కేయూలో భూముల పరిశీలన
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో వివిధ చోట్ల భూముల ఆక్రమణల ఆరోపణల ఫిర్యాదుల నేపథ్యంలో విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. విజిలెన్స్ అధికారులు మున్సిపల్ కార్పొరేషన్, రెవెన్యూ సర్వేయర్ల అధికారులతో జాయింట్ ఇన్‌స్పెక్షన్ చేస్తుంది. మంగళవారం యూనివర్సిటీలోని న్యూ పీజీ హాస్టల్ బీసీ కాలనీ ప్రాంతంలోని 229 సర్వే నంబర్ భూమిలో కొన్నేళ్ల క్రితమే ఆక్రమణలు జరిగాయన్న ఆరోపణల ఫిర్యాదుల నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ సర్వేయర్లు, కేయూ బిల్డింగ్ డివిజన్ అధికారులతో కలిసి జాయింట్ ఇన్‌స్పెక్షన్ చేశారు. 229 సర్వే నంబర్‌లో యూనివర్సిటీకి చెందిన ఇద్దరు ముగ్గురు ఉద్యోగులు, మరికొందరు ఇళ్లు ఉన్నాయనే ఆరోపణలున్నాయని తెలుస్తోంది. ఇటీవల సంబంధిత అధికారులు ఆయా ఇంటి యాజమానులకు నోటీస్‌లు కూడా జారీ చేశారని సమాచారం. మంగళవారం విజిలెన్స్ అధికారులు, మున్సిపల్, రెవెన్యూ అధికారుల సర్వేయర్లతో అక్కడికి చేరుకొని అందరి నివాసితుల సమక్షంలో సర్వే చేపట్టారు. అక్కడికి విజిలెన్స్ అధికారులు ఇతర శాఖల అధికారుల సిబ్బంది బృందం చేరుకోగా అక్కడ నివాసం ఉంటున్న ఇంటి యాజమానులు అక్కడికి చేరుకున్నారు. వీరు తమ భూమి సర్వే నంబర్లు వేర్వేరుగా ఉన్నాయని 229 సర్వేనంబర్‌లో తమ ఇళ్లు లేవని, తాము గత కొన్నేళ్ల క్రితం కొనుగోలు చేసినట్లు చెబుతున్నారని సమాచారం. తమభూమికి సంబంధించిన పత్రాలు కొందరు ఇంటి యజమానులు భూమి పత్రాలు సంబంధిత విజిలెన్స్ అధికారులకు, రెవెన్యూ, సర్వేయర్లకు చూపించారని సమాచారం. కేయూ బిల్డింగ్ డివిజన్ అధికారులు మాత్రం 229 సర్వేనంబర్ భూమి ఆరు ఎకరాల 15 గుంటల భూమి ఉన్నట్లుగా రికార్డుల్లో ఉందన్నారు. అంతభూమి ఇప్పుడు కూడా ఉండాల్సి ఉంటుందని యూనివర్సిటీ భూమికి సంబంధించిన మ్యాప్‌ను కూడా విజిలెన్స్ అధికారులకు చూపించినట్లు బిల్డింగ్ డివిజన్ అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ ప్రాంతంలో భూమిని సర్వేను నిర్వహిస్తే వాస్తవాలు వెలుగులోని వస్తాయని భావిస్తున్నారు. ఈ సర్వే అనంతరం అధికారులు ఇచ్చే రిపోర్టును బట్టి తదుపరి చర్యలు ఉంటాయని భావిస్తున్నారు. ఇప్పటికే విజిలెన్స్ వివిధ శాఖలతో కలిసి జాయింట్ ఇన్‌స్పెక్షన్ ఇటీవలనే యూనివర్సిటీలోని పలివేల్పుల శివారు 412, 413, 414 సర్వేనంబర్లలో అలాగే లష్కర్‌సింగారం శివారు 34 సర్వేనంబర్‌లో కూడా కొంతమేర ఆక్రమణలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ ఆయా శాఖల జాయింట్ ఇన్‌స్పెక్షన్ జరిగింది. ఆయా సర్వేనెంబర్ల భూముల్లో ఇంకా కొనసాగేది ఉందని భావిస్తున్నారు.
కేయూ భూములపై సమగ్ర విచారణ జరపాలి
కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన భూములపై విచారణ సమగ్రంగా పారదర్శకంగా జరపాలని పలు చోట్ల భూములు ఆక్రమణలకు గురయ్యాయని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (బీఆర్‌ఎస్‌వీ) కేయూ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచర్ల శరత్‌చంద్ర విజిలెన్స్ అధికారులకు విన్నవించారు. మంగళవారం కేయూలో విజిలెన్స్ అధికారులు వివిధ శాఖల మున్పిపల్ కార్పొరేషన్, రెవెన్యూ సర్వేయర్ల అధికారులు కేయూ బిల్డింగ్ డివిజన్ అధికారుల బృందం ఇన్‌స్పెక్షన్ చేసేందుకు రాగా అక్కడ విజిలెన్స్ అధికారి రాకేశ్‌ను కలిసి విన్నవించి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజిలెన్స్‌పై తమకు పూర్తిగా నమ్మకం ఉందన్నారు. కేయూకు సంబంఽధించిన పలివేల్పుల, లష్కర్‌సింగారం, పలు సర్వే నంబర్ల భూముల్లో ఇప్పటికే ఆక్రమణలు జరిగాయన్నారు. భూకబ్జాలు, ఆక్రమణలు నిర్మాణాలపై ఎలాంటి రాజకీయ ఒత్తిడిలకు గురి కాకుండా విచారణ కొనసాగించాలన్నారు. భూముల పరిరక్షణకోసం గతంలో డాక్టర్ నాగేందర్ బాబు ఆధ్వర్యంలో ల్యాండ్ కమిటీ ఇచ్చిన రిపోర్టును కూడా పరిగణలోనికి తీసుకోవాలని విజిలెన్స్ అధికారులను కోరినట్లు తెలిపారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో బీఆర్‌ఎస్‌వీ నాయకులు గొల్లపెల్లి వీరస్వామి, కందికొండ తిరుపతి, రత్నం, అశోక్ తదితరులు ఉన్నారు.
ఆక్రమణల ఆరోపణలపై
వివిధశాఖలతో కలిసి విజిలెన్స్ అధికారులు జాయింట్ ఇన్‌స్పెక్షన్
Comments
Please login to add a commentAdd a comment