అసోసియేట్ ప్రొఫెసర్‌ఇస్తారికి పేటెంట్ హక్కు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ జంతుశాస్త్ర విభాగ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మామిడాల ఇస్తారికి భారత ప్రభుత్వ పేటెంట్ కార్యాలయం ‘ప్రతి అనులేఖనాన్ని నిరోధించడంలో ఎక్లీప్టా ఆల్బా మొక్కల పాత్ర’ అనే అంశంపై పేటెంట్ హక్కు జారీ చేసింది. ఇస్తారి పర్యవేక్షణలో గతంలో డాక్టర్ లూనావత్ వెంకన్న పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఇందులో భాగంగా ఈ పరిశోధన ఫలితాలను 2022 అక్టోబర్‌లో ఇస్తారి పేటెంట్ హక్కుల కోసం భారత ప్రభుత్వ పేటెంట్ కార్యాలయానికి దరఖాస్తు చేశారు. 2023లో దరఖాస్తులో పొందుపరిచిన వివరాలను పరిశీలించిన అనంతరం మంగళవారం భారత ప్రభుత్వ పేటెంట్ కార్యాలయం నుంచి ఈ పరిశోధనపై పేటెంట్ హక్కు పొందేందుకు అనుమతి ఇస్తున్నట్లు ఈ–మెయిల్ వచ్చింది. ఈ పేటెంట్ హక్కు 20 సంవత్సరాల వరకు ఉంటుందని సర్టిఫికెట్‌పై పొందుపరిచారు. ఈ సందర్భంగా ఇస్తారి, వెంకన్నను కేయూ వీసీ ప్రతాప్ రెడ్డి తన చాంబర్‌లో పేటెంట్ సర్టిఫికెట్ అందజేస్తూ అభినందించారు. అకడమిక్ పరంగా పని చేసే వారిని యూనివర్సిటీ ఎప్పుడూ ప్రోత్సాహం ఇస్తుందన్నారు. కాగా, ఇస్తారి పర్యక్షణలో ఇప్పటి వరకు 12 మంది పీహెచ్‌డీ పూర్తిచేశారు. రిజిస్ట్రార్ మల్లారెడ్డితో సహా పలువురు బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment