ఎంజీఎంలో అధ్వానంగా అత్యవసర విభాగాల సేవలు
శనివారం శ్రీ 2 శ్రీ నవంబర్ శ్రీ 2024
– 8లోu
ఇంటి తలుపునకు అంటించిన స్టిక్కర్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్ ప్రావీణ్య
దేవాన్ష్‌కు చెస్‌లో
అంతర్జాతీయ రేటింగ్
వరంగల్ స్పోర్ట్స్: గత నెల 22 నుంచి 27వ తేదీ వరకు విజయవాడలో భారతీయ క్రీడా విద్యాలయ సంస్థ నిర్వహించిన చెస్ పోటీల్లో హనుమకొండ రాంనగర్‌కు చెందిన ఆరేళ్ల బాలుడు బైరి దేవాన్ష్‌రెడ్డి పాల్గొని 1,485 రాపిడో రేటింగ్ సాధించినట్లు బాలుడి తల్లిదండ్రులు రఘువీరారెడ్డి, దివ్య తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 500 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ టోర్నమెంట్‌లో దేవాన్ష్‌కు అంతర్జాతీయ స్థాయి రేటింగ్ రావడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. రాంనగర్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో 1వ తరగతి చదువుతున్న దేవాన్ష్‌ను వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య సభ్యులు కన్నా, శ్రీనివాస్, ప్రేమ్‌సాగర్, తదితరులు అభినందించారు.
హనుమకొండ
డీఎంహెచ్‌ఓగా అప్పయ్య
ఎంజీఎం : హనుమకొండ జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిగా డాక్టర్ అల్లెం అప్పయ్య గురువారం బాధ్యతలు స్వీకరించారు. ములుగు డీఎంహెచ్‌ఓగా కొనసాగిన ఆయన.. మేడారం సమ్మక్క – సారలమ్మ జాతరలో వైద్య సేవల నిర్వహణను సమర్థవంతంగా నిర్వర్తించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్.నాగరాజు, కలెక్టర్ ప్రావీణ్యను డీఎంహెచ్‌ఓ అప్పయ్య మర్యాద పూర్వకంగా కలిశారు.
వరంగల్ డీఎంహెచ్‌ఓగా సాంబశివరావు
గీసుకొండ: వరంగల్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ)గా డాక్టర్ బి.సాంబశివరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. హనుమకొండ డీఎంహెచ్‌ఓగా పనిచేస్తున్న ఆయనను ఇటీవల ప్రభుత్వం వరంగల్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతవరకు వరంగల్ డీఎంహెచ్‌ఓగా పనిచేసిన డాక్టర్ కె.వెంకటరమణ కరీంనగర్ డీఎంహెచ్‌ఓగా బదిలీపై వెళ్లారు. ఈమేరకు సాంబశివరావు, డాక్టర్ వెంకటరమణను అధికారులు, సిబ్బంది, ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు సన్మానించారు.
నిబంధనల ప్రకారం డైట్
టెండర్ కేటాయింపు
ఎంజీఎం : ఎంజీఎం ఆస్పత్రిలో రోగులు, వారి సహాయకులకు ఆహారం అందించే డైట్ టెండర్ ప్రక్రియను నియమ నిబంధనల ప్రకారం, డైట్ కమిటీ ఏకగ్రీవ తీర్మానంతోనే నిర్ణయం తీసుకున్నట్లు ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళి ఒక ప్రకటనలో తెలిపారు. పలు సంస్థలపై వచ్చిన ఫిర్యాదులను పూర్తిగా నిర్ధారించుకున్న తరువాతే నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా, 2022 – 24నకు జనగామ ఆస్పత్రిలో జరిగిన టెండర్‌లో సాంకేతిక కారణాల వల్ల సరైన పత్రాలు సమర్పించకపోవడంతో టెక్నికల్ బిడ్‌లో సరోజ క్యాటర్స్ అండ్ హాస్టల్స్ అర్హత సాధించలేదని తెలిపారు.
ఇంటర్‌వర్సిటీ బాస్కెట్‌బాల్
పోటీలకు కేయూ జట్టు
కేయూ క్యాంపస్: బెంగళూరులోని క్రిస్ట్ యూనివర్సిటీలో ఈనెల 5వ తేదీ వరకు నిర్వహించనున్న సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ బాస్కెట్ బాల్ (పురుషుల) టోర్నమెంట్‌లో కేయూ జట్టు పాల్గొననుందని కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ ప్రొఫెసర్ వెంకయ్య శుక్రవారం తెలిపారు. ఈ జట్టులో కె.యశ్వంత్ (యూసీపీఈ కేయూ), ఎం.ప్రణయ్‌కుమార్ (కేయూ కో ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాల), బి.ఈశ్వర్ (కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హనుమకొండ), టి.విశ్వనాథ్, ఎం.ప్రవీణ్, గణేష్‌కుమార్ (ఎల్‌బీ కళాశాల వరంగల్), ఎండీ.మొయినొద్దీన్, కె.పవన్‌పాల్ (వాగ్దేవి డిగ్రీ కళాశాల, హనుమకొండ), ఎస్.రాకేష్‌యాదవ్ (కిట్స్, వరంగల్), టి.కన్నారావు (ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహబూబాబాద్), సీహెచ్.ఈశ్వర్ (నలంద డిగ్రీ కళాశాల, మహబూబాబాద్), ఆర్.నరేందర్ (ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ కళాశాల, ఖమ్మం) ఉన్నారు. ఈ జట్టుకు హనుమకొండలోని వాగ్దేవి డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ మోహన్‌కృష్ణ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నట్లు వెంకయ్య తెలిపారు.
పకడ్బందీగా సర్వే
నిర్వహించాలి
● ప్రతీ ఇంటికి స్టిక్కర్ అంటించాలి
● హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య
హసన్‌పర్తి: రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కులసర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ఎన్యూమరేటర్లను హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం జయగిరిలో కొనసాగుతున్న సర్వే తీరును ఆమె శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్లాక్ ప్రకారం సర్వే నిర్వహించాలని సూచించారు. ప్రతీ ఇంటికి సంబంధించిన వివరాలను నమోదు చేయాలని చెప్పారు. ఇంటిలో ఉన్న కుటుంబాల వివరాలను నమోదు చేయాలని, కుటుంబాల ఆధారంగా ఇంటికి బై నంబర్లు ఇవ్వాలని పేర్కొన్నారు. బ్లాక్‌లో ఎన్ని ఇళ్లు ఉన్నాయో సరిచూసుకోవాలన్నారు. సర్వే అనంతరం ఇంటికి స్టిక్కర్లు అంటించాలని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ చల్లా ప్రసాద్, ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్, ఎంపీఓ కర్ణాకర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
ఎంజీఎం :
‘నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అన్న పాట వినగానే అంత అధ్వానంగా ఉంటాయా ప్రభుత్వ ఆస్పత్రి సేవలు అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అయితే, ప్రస్తుతం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి క్యాజువాలిటీని పరిశీలిస్తే ఆ పాట నిజమే అనిపిస్తోంది. ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగిని తీసుకువస్తే బతికిస్తారా.. అన్నది అనుమానమే. ఆస్పత్రి సేవలపై రోగులకు భరోసా కల్పించడంలో వైద్యాధికారులు పూర్తిస్థాయిలో విఫలమవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిలీవర్ వైద్యురాలు రాకముందే డ్యూటీలో ఉన్న వారు ‘నా విధులు 8 గంటల వరకే’ అని పేర్కొంటూ పోస్టు గ్రాడ్యుయేట్ వైద్యులకు అప్పగిస్తూ వెళ్లిపోతున్నారు. 24గంటల పాటు అందుబాటులో ఉండాల్సిన డ్యూటీ వైద్యులు ఫోన్ చేసి రావాలని చెబితే 15 నుంచి 25 నిమిషాల సమయం తర్వాత ఆ రోగి వద్దకు చేరుకుంటారు. ఆ లోపు ఉన్న ప్రాణం కాస్త గాలిలో కలిసే పరిస్థితి. అదేవిధంగా తలపగిలి తీవ్ర రక్తస్రావంతో వచ్చే రోగులను మెరుగైన సేవల కోసమంటూ హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఈ రకమైన సేవలతో ఎంజీఎం ఆస్పత్రిపై పూర్తిస్థాయి భరోసా కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సమీక్షలు నిర్వహించినా ఫలితమేదీ..?
40 రోజుల క్రితం స్వయంగా జిల్లా మంత్రి కొండా సురేఖతో కలిసి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సందర్శించి ప్రతీ పేదవాడికి మెరుగైన సేవలందించాలని ఆదేశించారు. తనకు ఔషధాలు బయట కొనుగోలు చేయాలని చెప్పారని ఓ రోగి.. మంత్రి దృష్టికి తీసుకువస్తే వెంటనే ఆ డాక్టర్ ఎవరో తెలుసుకుని సస్పెండ్ చేయాలని చెప్పారు. స్వయంగా రాష్ట్ర మౌలిక సదుపాయాల సంస్థ ఎండీ, ఐఏఎస్ అధికారి ఆస్పత్రి సందర్శించి డీఎంఈ సమక్షంలో సమీక్ష సమావేశం నిర్వహించి ఆస్పత్రికి ఎలాంటి ఔషధాలు కావాలో.. ఏయే మౌలిక సదుపాయాలు కావాలో చెప్పాలని నివేదికలు రూపొందించారు. వరంగల్ కలెక్టర్ సత్యశారద ఆస్పత్రి రెండు, మూడు సార్లు తనిఖీలు చేసి సేవలు మెరుగుపరచాలని ఆదేశించి పలువురు వైద్యులకు మెమోలు జారీ చేశారు. అయినా వైద్యుల సమయపాలనలో మార్పు రావడం లేదు. కనీసం ఆస్పత్రిలోని క్యాజువాలిటీతోపాటు ఏఎంసీ, ఐఎంసీ విభాగాల్లో పడకలపై బెడ్ షీట్లు కూడా లేవంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది.
బెడ్‌షీట్ల కొరత ఉంది..
ఎంజీఎం ఆస్పత్రిలో బెడ్‌షీట్ల కొరత ఉంది. క్యాజువాలిటీ రిలీవర్ వైద్యులు రాకుండా సమయం ముగిసిందని డ్యూటీ వైద్యులు వెళ్లిపోతే చర్య తీసుకుంటాం. క్యాజువాలిటీ లోని ఏసీలు మరమ్మతు చేయిస్తాం.
– డాక్టర్ మురళి, ఎంజీఎం సూపరింటెండెంట్
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన గొడిశాల ప్రశాంత్‌ది నిరుపేద కుటుంబ నేపథ్యం. ఓవైపు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతూనే.. 13వ ఏటా నుంచే క్రికెట్, సిట్టింగ్ వాలీబాల్, పారా త్రోబాల్ క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణిస్తూ.. అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఏలూరులో జరిగిన ఓ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి.. మొదలైన అతడి క్రీడా ప్రస్థానం.. విజయవంతంగా సాగుతూనే ఉంది. హైదరాబాద్ డిజెబుల్ టీంకు కెప్టెన్‌గా మూడేళ్లు, రెస్టాఫ్ ఆలిండియాకు రెండు సార్లు, డిజెబుల్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (డీసీసీఐ) ఆధ్వర్యంలో రాజస్థాన్‌లో జరిగిన క్రికెట్ మ్యాచ్‌ల్లో ఇటు బౌలింగ్, అటు బ్యాటింగ్‌లో రాణించాడు. అలాగే.. 2013లో చైన్నెలోని నెహ్రూ స్టేడియంలో జరిగిన నేషనల్ పారా అథ్లెటిక్స్‌లో 100 మీటర్ల విభాగంలో పరుగెత్తి సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. 2023 ఈజిప్టులోని కైరోలో జరిగిన సిట్టింగ్ వాలీబాల్ వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌లో పాల్గొని అందరి ప్రశంసలు అందుకున్నాడు.
జాతీయ వేదికపై..
ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో చదివిన ప్రశాంత్.. ఆ తర్వాత బీటెక్, ఎంటెక్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో పూర్తి చేశాడు. ప్రస్తుతం చైతన్య డీమ్డ్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్నాడు. 2014 నుంచి 2023 వరకు వరంగల్‌లోని టీటీడీ బధిరుల పాఠశాల, హైదరాబాద్‌లోని హెలెన్ కెల్లర్ స్కూల్ ఇన్‌స్టిట్యూట్లలో, కరీంనగర్‌లోని బధిరుల రెసిడెన్షియల్ ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు గణితం, సామాన్య శాస్త్రం బోధించాడు. అదే సమయంలో బధిరులకు షార్ట్‌ఫుట్, రన్నింగ్, జావలిన్ త్రో, క్రికెట్‌లో శిక్షణ ఇచ్చి మెరుగైన క్రీడాకారులను కూడా తీర్చిదిద్దాడు. ‘ఈ ఏడాది సెప్టెంబర్ 21 నుంచి 23 వరకు జార్ఖండ్‌లో జరిగిన పారా త్రోబాల్ నేషనల్ గేమ్స్‌కు తెలంగాణ నుంచి కెప్టెన్‌గా వ్యవహరించాడు. 24 జట్లు పోటీపడిన ఈ టోర్నీలో ఐదో స్థానంలో నిలిచాడు. సిట్టింగ్‌త్రో బాల్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చడంతో భారత జట్టు పారా త్రోబాల్ టీంకు కెప్టెన్‌గా అతడికి అవకాశం ఇచ్చారు. తెలంగాణ నుంచి కల్యాణ్ పాటిల్ (మంచిర్యాల), ధీరా వత్ మహేశ్‌నాయక్ (మేడ్చల్), చింతూ రెడ్డి (మేడ్చల్ జిల్లా) బృంద సభ్యులుగా ఎంపికయ్యారు.
వైకల్యమే.. వైఫల్యం కాదు..
అంగవైకల్యమనేది దేనికీ అడ్డు కాదు. కృషి ఉంటే దేన్నయినా జయించవచ్చు. అంగవైక్యల్యం ఉన్నవారిపై చిన్న చూపు ఉంది. సాధారణ క్రీడాకారుల మాదిరిగానే దివ్యాంగ క్రీడాకారులను ప్రోత్సహించాలి. అప్పుడే అంగవైకల్యం ఉన్న ప్రతిఒక్కరూ క్రీడల్లో రాణించి దేశానికి పతకాలు అందిస్తారు. మా అక్క పద్మ సహకారంతో ఆటల్లో రాణిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభిస్తే మరెన్నో టోర్నీలు ఆడి దేశానికి మంచి పేరు తీసుకొస్తా.
– గొడిశాల ప్రశాంత్
ఇందిర, పటేల్‌కు నివాళి
హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి, మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఇరువురి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్.నాగరాజు, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, డీసీసీ వరంగల్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. – హన్మకొండ చౌరస్తా
ఫోన్ పోతే చింతించకండి
పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్‌ఝా
హసన్‌పర్తి: సెల్‌ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు చింతించాల్సిన అవసరం లేదని, స్థానిక పోలీస్ స్టేషన్, సీసీఎస్‌లో ఫిర్యాదు చేస్తే ఫోన్లు రికవరీ చేస్తామని పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్‌ఝా తెలిపారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోగొట్టుకున్న సెల్‌ఫోన్ రికవరీ మేళాను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్న మొబైళ్లను బాధితులకు అందించారు. అనంతరం జరిగిన సమావేశంలో సీపీ మాట్లాడుతూ ఫోన్ పోగొట్టుకుంటే వెంటనే సీఇఐఆర్ ఫోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా క్రైమ్ ఏసీపీ భోజరాజ, సీపీఎస్ ఇన్‌స్పెక్టర్ బాలాజీ వరప్రసాద్, రఽఘుపతిరెడ్డి, ఐటీ కోర్ హెడ్ కానిస్టేబుల్ మాధవరావు, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, సిబ్బందిని సీపీ అంబర్ కిశోర్ ఝా అభినందించారు.
నగరవ్యాప్తంగా గురు, శుక్రవారం దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. పిల్లలు, పెద్దలు సరదాగా టపాసులు కాల్చారు. పలు కుటుంబాల వారు సంప్రదాయబద్ధంగా కేదారేశ్వరి, సత్యనారాయణస్వామి నోములు నోచుకున్నారు. ఇళ్లలో లక్ష్మీపూజలు జరుపుకున్నారు. నగరంలోని భద్రకాళి, వేయిస్తంభాల ఆలయాలను భక్తులు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
న్యూస్‌రీల్
పడకలపై కనీసం బెడ్ షీట్లు లేని వైనం
పనిచేయని ఏసీలు.. ఏఎంసీ, ఐఎంసీలలో కానరాని మానిటర్లు
మంత్రి ఆదేశించినా.. కలెక్టర్ సందర్శించినా ఫలితం శూన్యం
– 8లోu
డీఎస్పీ సత్యనారాయణకు అవార్డు
ప్రతిష్ఠాత్మక కేంద్రీయ గృహమంత్రి దక్షత పదక్ పురస్కారం
ప్రస్తుతం ఇంటెలిజెన్స్
వరంగల్ డీఎస్పీ విధులు
వెలుగుల దీపావళి
పనిచేయని ఏసీలు..
పరిపాలనాధికారులు తమ గదుల్లో 24 గంటలపాటు ఏసీలు పనిచేసేలా చూసుకుంటారు. కానీ ఏఎంసీ, ఐఎంసీ (అత్యవసర వార్డులు), క్యాజువాలిటీల్లో నెలల తరబడి పనిచేయకపోయినా పట్టించుకోవడం లేదు. కాలిన గాయాలతో వచ్చే రోగులకు పూర్తిస్థాయి ఏసీ గదుల్లోనే చికిత్సలు అందించాలి.
అధ్వానంగా అత్యవసర వార్డులు..
ఎంజీఎం ఆస్పత్రిలో ఏఎంసీ, ఐఎంసీ క్యాజువాలిటీ విభాగాల్లోని అబ్జర్వేషన్ గదులు ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగులకు సేవలందించేందుకు కీలకమైనవి. ఎమర్జెన్సీ విభాగం, డ్యూటీ వైద్యులు, పీజీలు, హౌస్ సర్జన్లు నిత్యం వచ్చే వందలాది మంది రోగులకు అందుబాటులో ఉండి చికిత్సలు అందిస్తూ ఉండాలి. కనీసం ఆయా విభాగాధికారులు.. ఈ విభాగాల పర్యవేక్షణ పట్టించుకోకపోవడంతో సేవలు అధ్వానంగా మారినట్లు స్పష్టమవుతోంది. రోగులు స్ట్రెచర్లపై పడుకుని ‘మా పడక ఎప్పుడు దొరుకుతుందా.. డాక్టర్ ఎప్పుడు చూస్తాడా’ అని ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment