హనుమకొండకు చేరుకున్న బీసీ కమిషన్
హన్మకొండ: స్థానిక సంస్థల రిజర్వేషన్ల దామాషాపై ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా శనివారం నిర్వహించే విచారణలో పాల్గొనేందుకు బీసీ కమిషన్ బృందం శుక్రవారం రాత్రి హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్ చేరుకుంది. ఈమేరకు కలెక్టర్ పి.ప్రావీణ్య, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డిలు.. కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాల లక్ష్మిలకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ డీడీ రాంరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. బీసీ కమిషన్ బృందం శనివారం ఉదయం వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే విచారణలో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, వివిధ కుల సంఘాల నుంచి వినతిపత్రాలు, దరఖాస్తులు, అభిప్రాయాలను బృందం సభ్యులు స్వీకరిస్తారని అధికారులు తెలిపారు.
కమిషన్ బృందానికి తెలపొచ్చు..
వరంగల్: రిజర్వేషన్లపై వరంగల్ జిల్లాలోని అన్ని కులాలకు సంబంధించిన ఆసక్తి కలిగిన ప్రతినిధులు వారి కులాల సమస్యలు, రాజకీయ, సామాజిక, ఆర్థికపరమైన అభ్యర్థనలు బీసీ కమిషన్ బృందానికి తెలపవచ్చని కలెక్టర్ సత్యశారద శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్‌లో జరిగే విచారణలో 6 సెట్ల కాపీలతో పాటు రూ.20 నాన్ జ్యుడీషియల్ స్టాంపు పేపర్‌పై అఫిడవిట్ సమర్పించాలని సూచించారు.
నేడు కలెక్టరేట్‌లో స్థానిక రిజర్వేషన్లపై ప్రజాభిప్రాయ సేకరణ
Comments
Please login to add a commentAdd a comment