జనరల్ స్టోర్‌పై టాస్క్‌ఫోర్స్ దాడులు
ఖిలా వరంగల్: అక్రమంగా బాణసంచా నిల్వ చేసిన ఓ బేకరీ అండ్ జనరల్ స్టోర్‌పై టాస్క్‌ఫోర్స్ అధికారులు మంగళవారం దాడులు నిర్వాహించారు. ఈదాడుల్లో సుమారు రూ.47,65,775ల విలువైన బాణసంచా సీజ్ చేసి, ఇద్దరి నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. వరంగల్ శాకరాశికుంట శాంతినగర్‌లో ఎస్‌ఆర్ బేకరీ అండ్ జనరల్ స్టోర్ నిర్వాహకులు మంచాల లక్ష్మీ ప్రసన్న, మంచాల శ్రీమాన్ నారాయణ అనుమతి లేకుండా బాణ సంచా నిల్వ చేశారని వరంగల్ టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్‌కు సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు మంగళవారం ఉదయాన్నే మంచాల లక్ష్మీ ప్రసన్న, మంచాల శ్రీమాన్ నారాయణ అక్రమంగా బాణసంచా నిల్వ ఉంచిన ఎస్‌ఆర్ బేకరీ అండ్ కిరాణాషాపుపై ఇన్‌స్పెక్టర్ సార్ల రాజు ఆధ్వర్యంలో ఆకస్మికంగా దాడులు చేశారు. సుమారు రూ. 47,65,775ల విలువైన బాణసంచాను సీజ్ చేశారు. అనంతరం ఇద్దరు నిర్వాహకులపై కేసు నమోదు చేసి తదుపరి చర్యల నిమిత్తం కేసును మిల్స్ కాలనీ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సార్ల రాజు తెలిపారు.
రూ.47.65 లక్షల విలువైన బాణసంచా సీజ్
ఇద్దరిపై కేసు నమోదు
Comments
Please login to add a commentAdd a comment