సమగ్ర కుటుంబ సర్వే షురూ
వరంగల్ అర్బన్: వరంగల్ మహానగరంలో సమగ్ర కుటుంబ సర్వే ప్రక్రియ బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. 66 డివిజన్లలో 2,90,969 గృహాలు ఉండగా.. 1,674 మంది ఎన్యుమరేటర్లు, 168 మంది సూపర్‌వైజర్లతోపాటు జీడబ్ల్యూఎంసీ ఆర్వోలు, వార్డు ఆఫీసర్లు, కార్పొరేటర్లు సర్వేలో పాల్గొంటున్నారు. ఈ నెల 8 వరకు గృహాలు, కుటుంబాలను గుర్తించడంతోపాటు స్టిక్లర్లను అతి కించనున్నారు. కాగా, మొదటి రోజు నగరంలో 26,460 ఇళ్ల గుర్తించి స్టిక్కర్లు అతికించారు. కాజీపేట సర్కిల్ పరిధిలో 19,960 ఇళ్లు, కాశిబుగ్గ సర్కిల్ పరిధిలో 6,500 ఇళ్లను ఎన్యుమరేటర్లు గుర్తించి స్టిక్టర్లు వేశారు. అంతేకాకుండా కాశిబుగ్గ సర్కిల్ పరిధిలో సర్వే కోసం బుక్‌లెట్లు, ఇతర సామగ్రిని పంపిణీ చేశారు. ఏ రోజుకారోజు కంప్యూటర్లలో డాటాను ఎంట్రీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఎన్యుమరేటర్లు ఒకవేళ ఇళ్లను సందర్శించకపోతే ఆయా వార్డు కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశారు.
సమగ్ర సమాచారంతో సర్వే నిర్వహించండి..
రామన్నపేట: సమగ్ర సమాచారంతో సర్వే నిర్వహించాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు మేయర్ ప్రాతినిథ్యం వహిస్తున్న 29వ డివిజన్‌లోని మల్లికార్జునస్వామి (కుంటి వీరభద్రయ్య) దేవస్థానం వద్ద కులగణన సర్వేను కమిషనర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సమగ్ర కులగణన సర్వే దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలని, బడుగు బలహీనవర్గాలకు సమన్యాయం జరగాలని, దేశసంపద అన్ని వర్గాలకు చేరాలన్నది రాహుల్‌గాంధీ ఆలోచన అని స్పష్టం చేశారు. సర్వే తీరును మేయర్, కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
నగరంలో మొదటి రోజు
26,460 గృహాలకు స్టిక్కర్లు
విధుల్లో 1,674 మంది ఎన్యుమరేటర్లు, 168 మంది సూపర్‌వైజర్లు
పర్యవేక్షించిన మేయర్, కమిషనర్, అధికారులు, కార్పొరేటర్లు
Comments
Please login to add a commentAdd a comment