రెండో రాజధానిగా వరంగల్ అభివృద్ధి
కాజీపేట: రాష్ట్రానికి రెండో రాజధానిగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందని ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్.నాగరాజు, మేయర్ గుండు సుధారాణి స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి త్వరలో జిల్లాకు రానున్నారు. ఈ మేరకు బుధవారం హనుమకొండ కలెక్టరేట్‌లో కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, భద్రకాళి చెరువు పూడికతీత, భద్రకాళి ఆలయ మాడ వీధుల నిర్మాణం, మామునూరులో విమానాశ్రయం అభివృద్ధి పనులను సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. గత పాలకుల మాదిరిగా కాకుండా ప్రణాళికలతో నగరాన్ని ఒక మోడల్‌గా తీర్చిదిద్దుతామని పేర్కొ న్నారు. జిల్లా ప్రజల మదిలో స్థిరంగా నిలిచేలా సీఎం రేవంత్‌రెడ్డి అభివృద్ధి పనులు ప్రారంభిస్తారని పేర్కొన్నారు. సమావేశంలో వరంగల్ కలెక్టర్ సత్య శారద, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment