శంభునిపేటలో బైక్ దగ్ధం
ఖిలా వరంగల్: వరంగల్ శంభునిపేటలో ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ దగ్ధమైంది. బాధితుడి కథనం ప్రకారం..మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్ పరిధి శంభునిపేటకు చెందిన కత్తెపల్లి గౌతం రాజు తన ద్విచక్రవాహనాన్ని ఇంటి ముందు పార్క్ చేసి పడుకున్నాడు. మంగళవారం ఆర్ధరాత్రి తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌కు నిప్పు పెట్టారు. పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతుండడంతో అదే సమయంలో ఓ ఫంక్షన్లో వంటలు చేసి ఇంటికి వెళ్తున్న వారు గమనించి యజమానికి లేపి చెప్పారు. వెంటనే గౌతం రాజు బైక్‌పై నీళ్లు పోసి మంటలు ఆర్పి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుడు గౌతం రాజు బుధవారం సాయంత్రం మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment