ప్రయాణ పాట్లు..
కంకర పోసి ఏడాదైనా
ముందుకు సాగని పనులు
కాజీపేట అర్బన్: న్యూశాయంపేట టు భట్టుపల్లి బైపాస్ రోడ్డు నిర్మాణ పనుల్ని ఏడాది క్రితం ప్రారంభించారు. ఇప్పటి వరకు పనులు పూర్తి కాలేదు. నిత్యం న్యూశాయంపేట రైల్వే గేట్ మీదుగా కోట చెరువుకు ఆనుకుని రహదారి గుండా ద్విచక్రవాహనాలతో పాటు భారీ వాహనాల రాకపోకలు కొనసాగుతుంటాయి. హనుమకొండ నుంచి న్యూశాయంపేట మీదుగా భట్టుపల్లికి, కడిపికొండకు, ఉర్సుగుట్టకు అదే విధంగా వరంగల్‌కు వెళ్లేందుకు ఎంతో అనువుగా ఉంటుంది. కాగా రోడ్డు నిర్మాణం పూర్తి అయి ప్రయాణం కొనసాగిద్దామంటే కంకర రోడ్డు ప్రయాణంతో వాహనాలతో పాటు నగరవాసులకు తిప్పలు తప్పడం లేదు. ఏడాదిగా ఈ రోడ్డు నిర్మాణానికి మోక్షం ఎప్పుడో అంటూ ఎదురుచూస్తున్నారు.
ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి..
న్యూశాయంపేటలోని కోట చెరువు గుండా గల రహదారిపై ప్రయాణం సాగించాలంటే భయం వేస్తోంది. కంకర కారణంగా వాహనాలు అదుపుతప్పుతున్నాయి. మరో వైపు దుమ్ముధూళితో అనారోగ్యం బారిన పడుతున్నాం. తక్షణమే అధికారులు చొరవ తీసుకుని రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి.
– పెరుగు సురేశ్, న్యూశాయంపేట
Comments
Please login to add a commentAdd a comment