వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద
వరంగల్: ప్రభుత్వ విజయాలు ప్రజలకు వివరించేందుకే ప్రజాపాలన విజయోత్సవ కళాయాత్రను ప్రారంభించినట్లు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. ఈనెల 19 నుంచి డిసెంబర్ 7 వరకు నిర్వహించనున్న ప్రజాపాలన కళాయాత్ర వాహనాలను కలెక్టరేట్ ఆవరణలో బుధవారం కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సమాచార పౌరసంబంధాల శాఖ, సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కళాయాత్ర కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో విస్తృతంగా టీఎస్సెస్ కళాకారులు తమ ఆటాపాటలు, నాటికలతో అభివృద్ధి, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడమే కళాయాత్ర ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతిరోజూ మూడు గ్రామాల్లో ప్రదర్శనలు నిర్వహించాలని సూచించారు. ఈనెల 28న, డిసెంబర్ 3వ తేదీన రాష్ట్ర సాంస్కృతిక శాఖ నుంచి అంతడ్పుల నాగరాజు, అలేఖ్య కళా బృందాలతో జిల్లాలో భారీ కళా ప్రదర్శన నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీపీఆర్వో అయూబ్‌అలీ, కళాకారులు పాల్గొన్నారు.
అంకితభావంతో పనిచేయాలి..
మండల ప్రత్యేక అధికారులు అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ధాన్యం, పత్తి కొనుగోళ్లు, ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే పురోగతిపై బుధవారం ప్రత్యేక అధికారులతో ఆమె సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేలో జిల్లాలో 70 శాతం కుటుంబాల వివరాలను నమోదు చేశారని, నిర్దేశిత గడువులోగా 100 శాతం సర్వే పూర్తయ్యేలా ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment