సాగుకు రైతులకు అనుమతి ఇవ్వాలి
హన్మకొండ అర్బన్ : దేవూనూరు, నారాయణగిరి, ముప్పారం, ఎర్రబెల్లి గ్రామాల్లో రిజర్వ్ ఫారెస్ట్ కాని పట్టా భూములు ఉన్న రైతులు సాగు చేసుకునేందుకు అధికారులు అనుమతి ఇవ్వాలని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. తమ పట్టా భూములను ఫారెస్ట్ అధికారులు అటవీ భూములుగా పరిగణిస్తూ పంట పొలాల్లోకి అనుమతించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న విషయాన్ని ఇటీవల ఆయా గ్రామాల రైతులు ఎమ్మెల్యే కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై ఆయన బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ ప్రావీ ణ్యతో కలిసి జిల్లా ఫారెస్ట్, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ పట్టాదార్ భూములను ఫారెస్ట్ అధికారులు రిజర్వ్ ఫారెస్ట్ కింద ఉన్నాయని సాగును అడ్డుకోవడంతో పాటు రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా చూడాలని అధికా రులకు సూచించారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా అటవీ శాఖ అధికారి లావణ్య, అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
596.1 కేజీల
ఎండు గంజాయి ధ్వంసం
కాజీపేట అర్బన్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వ రంగల్ అర్బన్ (హనుమకొండ), జనగామ, వరంగల్ రూరల్ జిల్లాల పరిధిలో పాత కేసుల్లో నిల్వ ఉంచిన 596.1 కేజీల ఎండు గంజాయిని బుధవా రం ధ్వంసం చేసినట్లు హనుమకొండ ఎకై ్సజ్ సీఐ దుర్గాభవాని తెలిపారు. మూడు జిల్లాలోని తొమ్మిది ఎకై ్సజ్ స్టేషన్ల పరిధిలో పాత కేసుల్లో నిల్వ ఉంచిన 596.1 కేజీల ఎండు గంజాయిని కాజీపేట మండలం అమ్మవారిపేటలోని కాకతీయ మెడికల్ క్లీన్ స ర్వీసెస్ ఆవరణలో ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ జిల్లా ల ఎకై ్సజ్ సూపరింటెండెంట్‌లు కె.చంద్రశేఖర్, అరుణకుమారి, అనిత, తొమ్మిది ఎకై ్సజ్ స్టేషన్ల పరిధిలోని సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
18 కిలోల గంజాయి పట్టివేత
నర్మెట: గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి 18కిలోల సరుకును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై నగేశ్ తెలిపారు. ఒడిశాకు చెందిన తకున ప్రధాన్.. వసంత్ అనే వ్యక్తి నుంచి 18 కిలోల గంజాయి కొనుగోలు చేసి గుజరాత్‌కు తరలించేందుకు సోమవారం ఈస్ట్‌కోస్ట్ రైలులో బయలు దేరాడు. రైల్వే పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా బయపడి జనగామ స్టేషన్‌లో దిగి తప్పించకునే ప్రయత్నంలో బుధవారం నర్మెట చేరుకున్నాడు. తిరిగి వెళ్లే ప్రయత్నంలో మండల కేంద్రంలో పోలీసులు పట్టుకుని తనిఖీ చేయగా 18.7 కిలోల గంజాయి లభ్యమైంది. దీంతో తకున ప్రధాన్‌ను అరెస్ట్ చేసినట్లు ఎస్సై నగేశ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment