పకడ్బందీగా గ్రూప్–3 పరీక్ష ఏర్పాట్లు
హన్మకొండ అర్బన్: ఈనెల 17, 18 తేదీల్లో జిల్లాలో జరిగే గ్రూప్–3 పరీక్షకు ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, రీజనల్ కో–ఆర్డినేటర్లు, రూట్ ఆఫీసర్లు, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లు, రెవెన్యూ, పోలీస్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్శహించారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. పరీక్ష నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్లు ప్రధాన భూమిక పోషిస్తారని వారి గైడ్‌లైన్స్ మేరకే పరీక్షలు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో 83 కేంద్రాల్లో 33,456 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రంలోని చీఫ్ సూపరింటెండెంట్ మినహా అభ్యర్థులకు, ఇతర అధికారులెవ్వరికీ మొబైల్ తీసుకొచ్చే అనుమతి లేదని పేర్కొన్నారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి తప్పులు జరగకుండా అధికారులంతా సమన్వయంతో పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, రీజనల్ కో–ఆర్డినేటర్ సదానందం, ఆనంద కిషోర్, డీఆర్‌ఓ గణేశ్, డీసీపీ సలీమా, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
టీజీపీఎస్సీ చైర్మన్ వీడియో కాన్ఫరెన్స్..
గ్రూప్–3 పరీక్ష ఏర్పాట్లు, సన్నద్ధతపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి.. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పరీక్షను ప్రశాంతంగా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. సమావేశంలో హనుమకొండ కలెక్టర్ పి. ప్రావీణ్య, అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment