నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలి
మామునూరు : యాసంగిలో నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలని మామునూరు కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ రాజన్న సూచించారు. ఈమేరకు బుధవారం ఖిలా వరంగల్ మండలం మామునూరు కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు రాజు,సౌమ్య ఆధ్వర్యంలో యాసంగి వేరుశనగ, పొద్దు తిరుగుడు పంట సాగుపై హనుమకొండ జిల్లా వేలేరు మండలం ఎర్రబెల్లి గ్రామ రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఆ యన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడా రు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలవుతున్న కృష్ణోన్నతి యోజన పథకంలో భాగంగా వేరుశనగ, పొద్దు తిరుగుడు పంటలు సాగు చేసి సుస్థిరత సాధించాలని కోరారు. వేరుశనగకు పూత దశలో జిప్సం ఎకరానికి 200 కేజీలు చల్లాలన్నారు. లద్దె పురుగు, ఆకుముడత, కొల్లార్ రాట్ ఆశించే అవకాశం ఉన్న నేపథ్యంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. రైతు సాయిచంద్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment