కుటుంబ సర్వే వివరాలు గోప్యం
వరంగల్ అర్బన్: సర్వేలో సేకరించే వివరాలు గోప్యంగా ఉంటాయని, ప్రజలు అపోహలకు గురికావొద్దని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తెలిపారు. గురువారం వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 24వ డివిజన్ ఎల్లంబజార్‌లో కొనసాగుతున్న సర్వేను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తప్పిదాలకు తావులేకుండా ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ సమగ్ర సమాచారాన్ని సేకరించాలని ఆదేశించారు. ప్రతీ ఇంట్లోని ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ ఓపికతో ప్రతి కుటుంబం నుంచి స్పష్టత కలిగిన సమాధానాల్ని సేకరించాలని సూచించారు. సర్వే జరుగుతున్న సమయంలో కుటుంబ యజమానికి వారి వద్ద నుంచి సేకరించే సమాచారం గోప్యంగా ఉంచాలని, పౌరులకు అర్థమయ్యే రీతిలో నింపిన షెడ్యూల్ ఫారం జాగ్రత్తగా భద్రపర్చాలన్నారు. కమిషనర్ వెంట బల్దియా ఉప కమిషనర్ కృష్ణారెడ్డి, రెవెన్యూ అధికారి శ్రీనివాస్, ఎన్యుమరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
కాళోజీ కళాక్షేత్రం ప్రారంభానికి సిద్ధం
నయీంనగర్: ప్రారంభానికి తుది మెరుగులు దిద్దుకుంటున్న కాళోజీ కళాక్షేత్రాన్ని గురువారం ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి, వైస్ చైర్‌పర్సన్ అశ్విని తానాజీ వాకడే.. వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. కళాక్షేత్రాన్ని త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నందున పనుల్లో వేగం పెంచి పూర్తి చేయాలని ధికారులను ఆదేశించారు. పనుల పురోగతి వివరాల్ని ఎప్పటికప్పుడు తెలపాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సీపీఓ అజిత్‌రెడ్డి పాల్గొన్నార.రు
బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే
Comments
Please login to add a commentAdd a comment