ఎస్సార్‌లో యంత్ర–24 ప్రాజెక్ట్ ఎక్స్‌పో
హసన్‌పర్తి: హసన్‌పర్తి మండలం అన్నాసాగరం శివారులోని ఎస్సార్ యూనివర్సిటీలో యంత్ర–24 ప్రాజెక్ట్ ఎక్స్‌పోను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి అల్ట్రాటిక్ సిమెంట్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎన్.శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) టెక్నాలీజీ వివిధ ఇంజనీరింగ్ టెక్నాలజీల్లో ఎలా ఉపయోగపడుతోందో ఉదాహరణలతో వివరించారు. ప్రాజెక్ట్ ఎక్స్‌పోలతో విద్యార్థుల్లోని సృజనాత్మకను వెలికి తీసి నూతన టెక్నాలజీలు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం ఎస్సార్ యూనివర్సిటీ వీసీ డాక్టరక్ష్ దీపక్‌గార్గ్ మాట్లాడుతూ.. ఈకార్యక్రమంతో పారిశ్రామిక నిపుణుల అభిప్రాయాలు తెలుసుకునే అవకాశం లభించిందన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ ఎక్స్‌పోలో నిపుణులు వివిధ విభాగాల ప్రాజెక్ట్‌లను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ అర్చనారెడ్డి, డీన్ డాక్టర్ ఏవీవీ సుధాకర్, డాక్టర్ రవిచందర్, డాక్టర్ మహేశ్‌తోపాటు వివిధ విభాగాలకు చెందిన అధ్యాపకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment