విద్యారణ్యపురి: డిప్లొమా ఇన్ ఎలమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్‌ఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్‌ఇ)లలో అర్హత సాధించిన ఉమ్మడి వరంగల్ జిల్లా అభ్యర్థుల్లో ఇంతకు ముందు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ హాజరుకాని వారు ఈనెల 5న(గురువారం) హనుమకొండ ప్రభుత్వ డైట్ కళాశాలకు హాజరై తమ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకోవాలని ప్రిన్సిపాల్ ఎండీ అబ్దుల్‌హై మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ వెంట దరఖాస్తు ఫామ్, హాల్‌టికెట్, డీఈఈసెట్ 24 ర్యాంకు కార్డు, టెన్త్‌తోపాటు తదితర విద్యార్హతల సర్టిఫికెట్లు తీసుకురావాలన్నారు. అభ్యర్థులు ఈరెండో దశలో వెబ్ ఆప్షన్లకు ఈనెల 7 నుంచి 9వ తేదీవరకు ఇవ్వాల్సింటుంది. రిజర్వేషన్ మెరిట్ ప్రాతిపదికన ఈనెల 13న సెకండ్ ఫేజ్‌లో భాగంలో స్లైడింగ్, ఫ్రెష్ అభ్యర్థులకు కూడా సీట్లు కేటాయింపు ఉంటుందన్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 13 నుంచి 17వ తేదీ వరకు ఫీజు చెల్లించి అలాట్‌మెంట్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని సంబంధిత కళాశాలలో ఈనెల 18నుంచి 21వ తేదీ వరకు రిపోర్టు చేయాల్సింటుందన్నారు.
బీ–కేటగిరీ సీట్లలో
అడ్మిషన్ల ప్రక్రియ ఇలా..
బీ–కేటగిరీ సీట్లు భర్తీచేసే సమయంలో ప్రైవేట్, మైనార్టీ డైట్ కళాశాలల యాజమాన్యాలు ఈనెల 5న నోటిఫికేషన్ జారీచేస్తాయని తెలిపారు. ఈనెల 7నుంచి 9వతేదీవరకు దరఖాస్తులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. అభ్యర్థుల సర్టిఫికెట్లు, దరఖాస్తులను డైట్ ప్రిన్సిపాల్ ఈనెల 13నుంచి 17వ తేదీ వరకు పరిశీలిస్తారన్నారు. ఈనెల 18న యాజమాన్యాలు సీట్ల కేటాయిస్తాయన్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 18 నుంచి 20 వరకు సంబంధిత డైట్ కళాశాలలో రిపోర్టు చేయాల్సింటుందని ప్రిన్సిపాల్ అబ్దుల్‌హై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment