దివ్యాంగులకు చేయూతనివ్వాలి
హన్మకొండ అర్బన్: దివ్యాంగులకు చేయాతనివ్వాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల వారోత్సవాల్లో భాగంగా నగరంలోని మల్లికాంబ మనోవికాస కేంద్రంలోని దివ్యాంగ చిన్నారులకు చక్రవర్తి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని బుధవారం ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ.. దివ్యాంగ చిన్నారులకు సేవ చేస్తున్న సిబ్బందిని అభినందించారు. మానసిక దివ్యాంగులకు వైద్యపరంగా కావాల్సిన సహాయం చక్రవర్తి హాస్పిటల్స్ ద్వారా అందించడం సంతోషకరమన్నారు. మల్లికాంబ కేంద్రానికి ఎల్లప్పుడూ తమవంతు సహాయ సహకారాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో చక్రవర్తి హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తరుణ్‌కుమార్, వైద్యులు శ్రవణ్, వైశాలి, ప్రత్యూష, సూర్యప్రకాశ్, మల్లికాంబ సంస్థ నిర్వాహకులు బండా రామలీల, కోడం కళ్యాణ్, సిబ్బంది పాల్గొన్నారు.
కునిలో పురుషుల
భాగస్వామ్యం పెరగాలి
ఎంజీఎం: కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌కు పురుషుల భాగస్వామ్యం పెరగాలని హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య బుధవారం ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలోని పురుషులను ఆపరేషన్‌కు ప్రోత్సహించేలా ఆరోగ్య సిబ్బంది అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కుటుంబ నియంత్రణలో కోత, కుట్టు లేని ఎన్‌ఎస్‌వీ ఆపరేషన్‌తో ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ఈనెల 7న హసన్‌పర్తి పీహెచ్‌సీ, 9న వంగర పీహెచ్‌సీ, 10న పరకాల సీహెచ్‌సీలలో డాక్టర్ ఎండీ యాకూబ్‌పాషా ఆధ్వర్యంలో పురుషుల కోసం ఎన్‌ఎస్‌వీ క్యాంపును ఏర్పాటు చేసినట్లు వివరించారు. అర్హులైన వారు శాశ్వత కుటుంబ నియంత్రణ వేసెక్టమీ శిబిరాలను వినియోగించుకోవాలని కోరారు.
వన్యప్రాణుల రక్షణ
అందరి బాధ్యత
న్యూశాయంపేట: వన్యప్రాణులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని హనుమకొండ ఫారెస్ట్‌రేంజ్ అధికారి భిక్షపతి అన్నారు. బుధవారం ప్రపంచ వన్యప్రాణి పరిరక్షణ దినోత్సవాన్ని పురష్కరించుకుని హనుమకొండ సుబేదారి ఫారెస్ట్ కార్యాలయం నుంచి హంటర్‌రోడ్ కాకతీయ జువాలాజికల్ పార్క్ వరకు అధికారులు, సిబ్బందితో కలిసి బైక్‌ర్యాలీ నిర్వహించారు. మానవ తప్పిదాలతో వన్యప్రాణుల సంఖ్య నానాటికీ తగ్గుముఖం పడుతుందన్నారు. వన్యప్రాణులకు ఎలాంటి హాని కలిగించొద్దని కోరారు. కార్యక్రమంలో రేంజ్ అధికారులు శిరీష, డీఆర్‌ఓ మోహన్, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
విజిలెన్స్ విచారణ
ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రిలో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలపై వచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు విచారణ చేపట్టారు. ఆస్పత్రిలో రోగుల సేవల కోసం శానిటేషన్, సెక్యూరిటీ టెండర్ దక్కించుక్ను కృష్ణ కన్‌స్ట్రక్షన్, తాను ఏజెన్సీ, తెలంగాణ అభ్యుదయ ఏజెన్సీ, ఎంజీఎం ఆస్పత్రి పారామెడికల్ ఉద్యోగుల ఏజెన్సీలపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. తాను ఏజెన్సీలో పని చేస్తున్న నలుగురు ఉద్యోగులను, కృష్ణ కన్‌స్ట్రక్షన్‌లో పని చేస్తున్న నలుగురు సెక్యూరిటీ గార్డులు, నలుగురు శానిటేషన్ వర్కర్లు, తెలంగాణ అభ్యుదయ ఏజెన్సీలో పని చేస్తున్న నలుగురు కార్మికులను పిలిచి వారికి ఏమేర వేతనాలు అందిస్తున్నారు? నెల నెలా విధుల డుమ్మా పేరు మీద ఎంత మేర వేతనాలు కోత పెడుతున్నారు? అనే అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. అంతేకాకుండా కార్మికులు ఏ మేర ఈఎస్‌ఐ, ఈపీఎఫ్ చెల్లిస్తున్నారు? అనే అంశాలపై ఆరా తీసినట్లు అధికారులు తెలిపారు.
డిగ్రీ పరీక్షల్లో
20 మంది డీబార్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో బుధవారం నిర్వహించిన డిగ్రీ కోర్సుల 3వ సెమిస్టర్ పరీక్షల్లో వివిధ పరీక్ష కేంద్రాల్లో కాపీయింగ్ చేస్తూ 20 మంది విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డారు. వారిని డీబార్ చేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాదికారి ఆచార్య ఎస్.నర్సింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణాఽధికారి డాక్టర్ తిరుమలాదేవి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment