ఉత్సాహంగా సీఎం కప్ పోటీలు
హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. శుక్రవారం జిమ్నాస్టిక్ పోటీల్లో బాలబాలికలు నువ్వా నేనా అన్నట్టు ప్రదర్శనలతో పోటీపడ్డారు. – సాక్షి, ఫొటోగ్రాఫర్ వరంగల్
ఈనెల 5న వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని ఓ గ్రామంలో 16 ఏళ్ల బాలికకు వరుసకు మేనబావ అయిన 28 ఏళ్ల యువకుడితో వివా హం చేస్తున్నట్లు చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు సమాచారం వచ్చింది. జిల్లా బాలల సంరక్షణ విభాగాఽ దికారులు బాలికను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరుపరిచారు. తర్వాత ఆమె తల్లిదండ్రులకు బాల్యవివాహంతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. 18 ఏళ్లు నిండే వరకు పెళ్లి చేయమని లిఖితపూర్వకంగా హామీ తీసుకుని బాలికను అప్పగించారు.
నవంబర్ 19న వరంగల్ జిల్లా దుగ్గొండి మండల పరిధి ఓ గ్రామంలో 16 ఏళ్ల అమ్మాయి, 25 ఏళ్ల అబ్బాయికి వివాహం అవుతున్నట్లు ఫోన్ రావడంతో జిల్లా బాలల సంరక్షణ అధికారులు వెళ్లి పెళ్లి ఆపారు. తర్వాత అమ్మాయిని సీడబ్ల్యూసీ ఎదుట హాజరుపరిచి నర్సంపేటలోని ఆశ్రమ పాఠశాలకు తరలించారు. అక్కడ రెండు రోజులున్న తర్వాత అమ్మాయిని తల్లిదండ్రులు తీసుకెళ్లారు.
ఈనెల 14న ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఓ 16 ఏళ్ల బాలికకు 27 ఏళ్ల యువకుడితో వివాహం చేస్తున్నారని 1098 నంబర్‌కు రెండురోజుల ముందే సమాచారం వచ్చింది. జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారులు వెళ్లి అమ్మాయి కుటుంబసభ్యులతో మాట్లాడారు. అనంతరం సీడబ్ల్యూసీ ఎదుట హాజరుపరిచి అమ్మాయి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. 18 ఏళ్లు నిండే వరకు పెళ్లి చేయమని లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో బాలికను వారితో పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment