సీఎంపై కేసు నమోదు చేయాలి
హన్మకొండ: ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో రాష్ట్రం పరువు తీసిన సీఎం రేవంత్‌రెడ్డిపైనే కేసు నమోదు చేయాలని బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకులతో మాట్లాడుతూ.. ఫార్ములా–ఈ రేస్‌పై అసెంబ్లీలో చర్చించాలని కోరితే సీఎం ము ఖం చాటేస్తున్నాడని విమర్శించారు. ప్రభుత్వ, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబం, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలపై కుట్రలకు పాల్పడి అక్ర మ కేసులు పెట్టి అరెస్టులకు పూనుకుందని ధ్వజమెత్తారు. కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, నాయకులు నాగూర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, పులి రజనీకాంత్, నయీముద్దీన్, జనార్దన్ గౌడ్, ఎల్లావుల లలితాయాదవ్, అశోక్, విక్టర్ బాబు, రజనీకుమార్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు
దాస్యం వినయ్‌భాస్కర్
Comments
Please login to add a commentAdd a comment