ఇందిరమ్మ ఇళ్ల సర్వే పక్కాగా చేయాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద
వరంగల్: ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియను పక్కాగా చేపట్టాలి.. అర్హుల వివరాలను మొబైల్ యాప్ లో నమోదు చేసేటప్పుడు పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద సూచించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకు న్న అర్హుల వివరాలను సర్వేయర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి మొబైల్ యాప్‌లో నమోదు చేస్తున్నా రు. వరంగల్ 18వ డివిజన్ లేబర్‌కాలనీ ప్రాంతంలో సర్వేను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే సిబ్బందికి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట కార్పొరేటర్ వస్కుల బాబు, జిల్లా పరిషత్ సీఈఓ రాంరెడ్డి, జీడబ్ల్యూఎంసీ కాశిబుగ్గ సర్కిల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment