అర్హులకు ప్రభుత్వ పథకాలు
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య
హన్మకొండ అర్బన్ : జిల్లాలోని అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ముఖ్య కర్తవ్యమని, నూతన సంవత్సరంలో జిల్లా ప్రజల అవసరాలను తీర్చి, వారి అభివృద్ధికి జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మంగళవారం ‘సాక్షి’ తో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ అదేశాల మేరకు ప్రజాపాలన పథకాలు సమర్థవంతంగా కొనసాగిస్తామన్నారు. ఈ పథకాల ద్వారా ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ సేవలు మెరుగుపర్చడానికి, అభివృద్ధిని వేగవంతం చేయడానికి అందరి సహకారం అవసరమన్నారు. జిల్లా ప్రజలందరూ నూతన సంవత్సరంలో ఆరోగ్యంగా, అనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
పేదలకు ఇందిరమ్మ ఇళ్లు
వరంగల్ కలెక్టర్ సత్య శారద
సాక్షి, వరంగల్: కొత్త సంవత్సరంలో మరింత ఉత్సాహంతో ‘డే వారియర్’గా విధులు నిర్వర్తించి జిల్లాలో ప్రభుత్వ పథకాలను పటిష్టంగా అమలు చేసేందుకు కృషిచేస్తానని వరంగల్ కలెక్టర్ సత్య శారద అన్నారు. మంగళవారం ఆమె సాక్షితో మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియను కూడా వేగవంతం చూసి పేదలకు సొంత గూడు కల్పించేలా పనిచేస్తామని వివరించారు. ఇప్పటికే ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ‘ఫిర్యాదుల పెట్టె’ ఏర్పాటు చేశాం. స్నానాలకు వేడి నీళ్లు తప్పనిసరిగా అందించేలా ఆదేశాలిచ్చానన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం సమర్థంగా అమలు చేసేందుకు దృష్టి సారిస్తామని తెలిపారు. విద్యార్థులు, యువకుల జీవితాలను ఆగమాగం చేస్తున్న మాదక ద్రవ్యాలు, గంజాయి నిర్మూలనకు అన్ని విభాగాలతో కలిసి సమన్వయంతో పనిచేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment