డీఆర్‌డీఏ ఈసీయూ జిల్లా కమిటీ ఎన్నిక
హన్మకొండ అర్బన్ : జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ (డీఆర్డీఏ) ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్(ఈసీ) యూనియన్ హనుమకొండ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కమలాపూర్ ఈసీ కార్తీక్, ప్రధాన కార్యదర్శిగా ఎల్కతుర్తి ఈసీ శ్రీకాంత్, ఉపాధ్యక్షుడిగా ఆత్మకూరు ఈసీ రాము, కోశాధికారిగా ధర్మసాగర్ ఈసీ శ్రీను, మిగతా మండలాల ఈసీలు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ మేరకు నూతన కమిటీ బాధ్యులు డీఆర్డీఓ మేన శ్రీనును మర్యాదపూర్వకంగా కలిశారు.
రేపు పిడియాట్రిషన్
పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ
ఎంజీఎం : నగరంలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్(ఎస్‌ఎన్‌సీయూ)లో ఖాళీగా ఉన్న రెండు పిడియాట్రిషన్ పోస్టులకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించేందుకు ఈనెల 4న ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్ప య్య ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్ డాక్టర్ కాలనీలోని కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయని, ఎంబీబీఎస్, ఎండీ పిడియాట్రిక్స్ పూర్తి చేసిన వారికి మొదటి ప్రాధాన్యం ఉంటుందన్నారు. వయోపరిమితి, నిబంధనలు, ప్రభుత్వ నియమాల ప్రకారం వర్తిస్తాయని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు విద్యార్హతలు, క్యాస్ట్, స్టడీ సర్టిఫికెట్లు ఒరిజినల్స్, ఒక సెట్ జిరాక్స్ కాపీలు, ఫొటోతో హాజరుకావాలని సూచించారు.
జిల్లాకు చేరిన
ఎస్సారెస్పీ నీరు
హసన్‌పర్తి: ఎస్సారెస్పీ నీరు విడుదలైంది. కాల్వల ద్వారా ఈ జలాలు బుధవారం సాయంత్రం జిల్లాకు చేరాయని, యాసంగి సాగుకు అందిస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. మొదటి వారంలో 4,000 క్యూసెక్కులు విడుదల చేశామని, చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. వారం బందీ పద్ధతిలో నీరు విడుదలవుతుందని, ఈనెల 9 నుంచి డిస్ట్రిబ్యూషన్లకు సరఫరా చేయనున్నట్లు వివరించారు. సాగుతో పాటు తాగు నీరు కూడా అందిస్తామని, ఎస్సారెస్పీ పరిధి అన్ని చెరువుల్లోకి కాల్వల ద్వారా నీరు చేరుతోందని చెప్పారు.
‘ఫస్ట్ సెమిస్టర్’
ఫలితాల విడుదల
కేయూ క్యాంపస్: హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ కళాశాలకు సంబంధించి బీఏ, బీకాం, బీఎస్సీ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షల ఫలి తాలు గురువారం కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ పి.మల్లారెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ విడుదల చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుహాసిని, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు డాక్టర్ కె.శ్రీనివాస్, సి.రాజిరెడ్డి, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ సురేశ్‌బాబు, అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ అరుణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment