జిల్లా అధికారులకు శుభాకాంక్షలు
వరంగల్: తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండమల్ల రవి అధ్వర్యంలో శనివారం వరంగల్ కలెక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో విజ యలక్ష్మి, వరంగల్ ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, ఏఓ విశ్వప్రసాద్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూక్యా నరసింహనాయక్, వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్షులు భూక్యా కస్నానాయక్, మరుపట్ల మల్లయ్య, పొట్లపల్లి రవీందర్‌రావు, గొట్టిముక్కల సాంబరాజు, ఎర్ర మురళి, బి.రమేశ్, జి.ఐలయ్య, సారంగపాణి, రాఘవులు, రాజేందర్ తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment