రైతు భరోసా ఎందరికి..!?
సాక్షిప్రతినిధి, వరంగల్: రైతు భరోసాపై సాగుతున్న చర్చకు ప్రభుత్వం ఫుల్‌స్టాప్ పెట్టింది. ‘ఇందిరమ్మ ఆత్మీయ భరో సా’ పేరిట ఈ పథకాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. కొత్త రేషన్‌కార్డులతో పాటు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకా న్ని ఈనెల 26 నుంచే అమలు చేయనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి శనివారం ప్రకటించారు. సాగుకు యోగ్యమైన భూములు కలిగిన, అర్హులైన రైతులకు ‘భరోసా’ ఇవ్వనున్నట్లు చెప్పారు. తండాలు, గూడేలు, మారుమూల గ్రామాలు, పల్లెల్లో భూమిలేని వ్యవసాయ రైతు కుటుంబాలకు కూడా ఈ పథకం వర్తింపజేయనుండగా, పెట్టుబడి సాయం అందని అర్హులైన రైతులు మంగళవారం వరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ నేపథ్యంలో కొద్ది నెలలుగా రైతు భరోసా అమలుపై వ్యక్తమవుతున్న సందేహాలకు తెరపడినట్లయ్యింది.
‘ఉప సంఘం’ పర్యటన తర్వాత నిర్ణయం..
రైతుభరోసా అమలుపై ప్రభుత్వం ఆరు నెలల కాలంలో వివిధ కోణాల్లో సమీక్ష సమావేశాలు నిర్వహించింది. ఇదే క్రమంలో గతేడాది జూలై 11 నుంచి 23 వరకు మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరుల బృందం జిల్లాల్లో పర్యటించింది. విభిన్నవర్గాలు, నిపుణులు, అధికారులు, రైతు సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించి.. పలు కోణాల్లో పరిశీలన, కసరత్తు అనంతరం శనివారం నిర్వహించిన కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 26 నుంచి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట ఎకరానికి ఏడాదికి రూ.12 వేల చొప్పున రైతులకు పెట్టుబడి సాయం అందించనున్నట్లు ప్రకటించారు. కాగా, రైతులతో పాటు రైతుకూలీలకు భరోసా కల్పిస్తామన్న ప్రభుత్వం.. తండాలు, గూడేలు, మారుమూల గ్రామాలు, పల్లెలోని భూమిలేని రైతు కుటుంబాలకు కూడా ఏడాదికి రూ.12 వేలు చెల్లిస్తామని ప్రకటించింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఆరు జిల్లాల్లో భూమిలేని నిరుపేద కుటుంబాలకు, వ్యవసాయంపై ఆధారపడిన రైతుకూలీలకు భరోసా కలుగనుంది.
ఎకరాకు ఏడాదికి రూ.12 వేలు
ఈనెల 26వ తేదీ నుంచి అమలు
ఉమ్మడి జిల్లాలో 2024 యాసంగికి 8.77 లక్షల మంది రైతులు
ఈసారి సంఖ్య పెరుగుతుందా?
తగ్గుతుందా?
భూమిలేని రైతు కుటుంబాలకు లబ్ధి
Comments
Please login to add a commentAdd a comment