మహిళ అస్థిపంజరం అవశేషాలు లభ్యం
● మర్రిపల్లిగూడెం శివారులో ఘటన
● ఘటనా స్థలిని పరిశీలించిన
కాజీపేట ఏసీపీ తిరుమల్
కమలాపూర్: మండలంలోని మర్రిపల్లిగూడెం శివారులో గుర్తు తెలియని ఓ మహిళ అస్థిపంజరం అవశేషాలు లభ్యమయ్యాయి. గ్రామ శివారులోని ఏలిమి అయిలయ్య వ్యవసాయ పొలం దగ్గర గుర్తు తెలియని ఓ మహిళ మృతదేహం ఉందనే సమాచారం మేరకు పోలీసులు సోమవారం ఘటనా స్థలిని పరిశీలించారు. అక్కడ అస్థిపంజరం అవశేషాలు పుర్రె, ఎముకలు, నల్లని, తల వెంట్రుకలు, లేత పసుపు రంగు చీర, ఆకుపచ్చ రంగు జాకెట్, నీలం రంగు లంగా, గాజులు, పుస్తెల తాడు వంటి వస్తువులు లభించగా ఎంజీఎం ఆస్పత్రికి తరలించి భద్రపరిచారు. పంచాయతీ కార్యదర్శి మారుపాక శరత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎవరీ మహిళ? ఇదెలా జరిగింది? ఎవరైనా హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడ రహస్యంగా పూడ్చిపెట్టారా? ఎన్నాళ్ల క్రితం ఈ ఘటన జరిగి ఉంటుంది? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ హరికృష్ణ తెలిపారు. సమాచారం అందుకున్న కాజీపేట ఏసీ పీ తిరుమల్ ఘటనా స్థలి, గుర్తు తెలియని మహిళ అస్థిపంజరం అవశేషాలను పరిశీలించి స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, అక్కడ ఓ మహిళ అస్థిపంజరం అవశేషాలను నెల రోజుల క్రితమే కొందరు గమనించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment