ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమ్మె విరమణ
● జిల్లాలో కేజీబీవీల ఎస్‌ఓలు విధుల్లోకి
● నేటినుంచి మిగతా ఉద్యోగులు కూడా..
విద్యారణ్యపురి : దాదాపు నెల రోజులుగా సమ్మె చేస్తున్న విద్యాశాఖలోని సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులు సోమవారం రాత్రి సమ్మె విరమించారు. కాగా హనుమకొండ, వరంగల్ జిల్లాల ఉద్యోగులు సోమవారం సైతం ఏకశిల పార్కువద్ద నిరసన దీక్షలు కొనసాగించారు. హైదరాబాద్‌లో డిప్యూటీ సీఎంతో ఎస్‌ఎస్‌ఏల సంఘం రాష్ట్రకమిటీ బాధ్యులతో చర్చలు జరి గాయని సమాచారం. ఆయా ఉద్యోగుల సమస్యలపై భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారని దీంతో సమ్మె విరమణకు నిర్ణయించారని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు దొనికల శ్రీధర్‌గౌడ్ సోమవారం రాత్రి వెల్లడించారు. సమగ్రశిక్ష ఉద్యోగుల్లో హనుమకొండ జిల్లాలోని తొమ్మిది కేజీబీ వీల్లో పనిచేస్తున్న స్పెషల్ ఆఫీసర్లు (ఎస్‌ఓలు) సోమవారం సాయంత్రం డీఈఓ కార్యాలయంలో సంబంధిత అధికారులను కలిసి తాము విధుల్లో చేరుతున్నామని తెలియజేశారు. కేజీబీ వీల్లోని కాంట్రాక్టు రిసోర్స్ టీచర్లు ఈనెల 7న విధుల్లో చేరే అవకాశం ఉంది. విద్యాశాఖలో డీఈఓ కార్యాలయాల్లోను, మండల రిసోర్స్ కేంద్రాల్లోను పనిచేస్తున్న మిగితా సమగ్ర శిక్ష ఉద్యోగులు కూడా విధుల్లో చేరబోతున్నారని సంబంధిత ఉద్యోగుల సంఘం నాయకులు వెల్లడించారు. ఇదిలా ఉండగా కేజీబీవీల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం డీఈఓ ప్రభుత్వ టీచర్లకు కేజీబీవీల్లో బోధించేందుకు సోమవారం ఉత్తర్వులు అందించారు. నేటినుంచి విధుల్లోకి చేరాల్సి ఉండగా ఇక సమగ్రశిక్ష ఉద్యోగులు అందులోని ఎస్‌వోలు, సీఆర్‌టీలు కూడా సమ్మె విరమణతో ఇక ప్రత్యామ్నాయంగా నియమించిన ప్రభుత్వ టీచర్లకు ఇచ్చిన ఉత్తర్వులు రద్దు అయినట్టేనని భావిస్తున్నారు.
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
నర్సింహులపేట: తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటన నర్సింహులపేటలో చోటు చేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఎరనాగి సీతా రా ములు సోమవారం మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లాడు. ఈ సమయంలో దుండగులు తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి సుమారు రూ.10 లక్షలకు పైగా నగదు, వెండి, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘట నపై బాధితుడి కుమారుడు రవి పోలీసుల కు సమాచారం ఇచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment