గిరిజన ఉద్యోగుల సంక్షేమానికి కృషి
హన్మకొండ : విద్యుత్ గిరిజన ఉద్యోగుల సంక్షేమానికి ఎన్పీడీసీఎల్ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కృషి చేస్తుందని ఆ అసోసియేషన్ కార్యదర్శి అజ్మీరా శ్రీరాం నాయక్ అన్నారు. సోమవారం హనుమకొండ శ్యామల దుర్గాదాస్ కాలనీలోని శ్యామల గార్డెన్‌లో ఎన్పీడీసీఎల్ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎన్పీడీసీఎల్ పరిధిలోని 17 జిల్లాల నుంచి ఎస్టీ విద్యుత్ ఉద్యోగులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో శ్రీరాం నాయక్ మాట్లాడుతూ గిరిజన ఉద్యోగులకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యలు తెలుసుకుంటూ వాటిని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. ఉద్యోగులు ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం ఎన్పీడీసీఎల్ కంపెనీ స్థాయి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా భూక్యా వాలునాయక్, అధ్యక్షుడిగా జాటోత్ హార్జీ, కార్యదర్శిగా అజ్మీరా శ్రీరాంనాయక్ ఎన్నికయ్యారు. శ్రీరాం నాయక్ వరుసగా పదోసారి కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సమావేశంలో ఎన్పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ సదర్‌లాల్, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ మాలోత్ రాంజీ నాయక్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్, ఎన్పీడీసీఎల్ అధ్యక్ష, కార్యదర్శులు నెహ్రూనాయక్, ఫకీరానాయక్, అన్ని జిల్లాల, డివిజన్ల అధ్యక్ష కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.
టీజీ ఎన్పీడీసీఎల్ కంపెనీ కార్యదర్శి శ్రీరాంనాయక్
Comments
Please login to add a commentAdd a comment