రోడ్డు భద్రతపై అవగాహన ఉండాలి
విద్యారణ్యపురి: రోడ్డుభద్రతపై ప్రతీఒక్కరికి అవగాహన ఉండాలని రాష్ట్ర రెవెన్యూ శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆర్‌టీఏ ఆధ్వర్యంలో సోమవారం హనుమకొండలోని ప్రభుత్వ హై స్కూల్‌లో నిర్మించబోతున్న ట్రాఫిక్ అవగాహన చిల్డ్రన్ పార్కు పనులకు రోడ్డు రవాణాశాఖమంత్రి పొన్నంప్రభాకర్, అటవీశాఖ మంత్రి కొండసురేఖతో కలిసి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు. రోడ్డుభద్రత చట్టాలున్నాయని, వాటిని పాటించా ల్సిన అవసరం ఉందన్నారు. సెల్‌ఫోన్‌లోమాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దన్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్, అటవీ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రోడ్డు భద్రతపై బాల్యదశ నుంచే అవగాహన కల్పించాలని, ట్రాఫిక్ నిబంధనలు కఠినతరం చేయాలన్నారు.రోడ్డుభద్రత మాసోత్సవం సందర్భంగా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయినిరాజేందర్‌రెడ్డి, నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, సిరిసిల్ల రాజయ్య, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ ప్రావీణ్య, ఆర్‌టీఏ జిల్లా అధికారి జి. వేణుగోపాల్, ఉప రవాణా కమిషనర్ శ్రీనివాస్ పుప్పాల, డీఈఓ వాసంతి, ఎంఈఓ నెహ్రూనాయక్ హెచ్‌ఎంకె రమేశ్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.
రెవెన్యూ శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment