విద్యార్థులు ప్రణాళికాప్రకారం చదవాలి
విద్యారణ్యపురి: ఇంటర్ మొదటి,సెకండియర్ పరీక్షలు సమీపిస్తున్నాయని, విద్యార్థులు ప్రణాళికా ప్రకారం చదువుకోవాలని ఇంటర్మీడియట్‌బోర్డు డిప్యూటీసెక్రటరీ, ఉమ్మడి వరంగల్ జిల్లా అకడమిక్ అబ్జర్వర్ టి. యాదగిరి సూచించారు. అలాగే, ఉత్తమ ఫలితాలు సాధించేలా అధ్యాపకులు కృషి చేయాలన్నారు. మంగళవారం ఉదయం తొలుత హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల (కోఎడ్యుకేషన్)ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు ఎన్ని యూనిట్ టెస్టులు నిర్వహించారని అడిగి తెలుసుకున్నారు. సైన్స్‌ల్యాబ్‌లను పరిశీలించారు. అకడమిక్ పరంగా విద్యార్థుల రికార్డులను పరిశీలించారు. అనంతరం ప్రిన్సిపాల్ ఆర్. శ్రీనివాస్, ఆ కళాశాల అధ్యాపకులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కృష్ణ ఆదిత ఇంటర్‌విద్య పటిష్టానికి తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంపుదల చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన వెంట డీఐఈఓ ఎ. గోపాల్ ఉన్నారు. అనంతరం జిల్లాలోని శాయంపేట, ఆత్మకూరు, పరకాల ,హసన్‌పర్తి, ధర్మసాగర్ ప్రభుత్వజూనియర్ కళాశాలలను సందర్శించి విద్యార్థులు, అధ్యాపకులు, ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో మాట్లాడి అత్యధికంగా ఉత్తీర్ణతశాతం పెంపుదలకు కృషి చేయాలని కోరారు.
ఇంటర్మీడియట్ బోర్డు డిప్యూటీ సెక్రటరీ యాదగిరి
Comments
Please login to add a commentAdd a comment