వరంగల్ జూపార్క్‌లో ఎన్‌క్లోజర్స్ ప్రారంభానికి మంత్రి కొండా సురేఖ సమయమిచ్చినా అత్యవసర సమావేశం కారణంగా ఓసారి వాయిదా పడింది. మరోసారి మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్ మరణంతో ఏడు రోజులు రాష్ట్ర ప్రభుత్వం సంతాప దినాలు ప్రకటించడంతో పర్యటన ఖరారు కాలేదు. ఈనెల ఎనిమిది లేదా పదో తేదీన పర్యటన ఖరారు అయ్యిందని అనుకుంటున్న తరుణంలో స్థానిక పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి స్థానికంగా లేకపోవడంతో 11వ తేదీకి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఆ రోజు అయినా ఎన్‌క్లోజర్స్ ప్రారంభానికి ముహూర్తం వస్తుందా? పులులు బోనులోనుంచి బయటికి వచ్చి సందడి చేస్తాయా? అని సందర్శకులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment