● బీఆర్‌ఎస్ హనుమకొండ
జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్
హన్మకొండ: మాజీ మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా కేసు పెట్టిందని ఆ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో కేటీఆర్ హైదరాబాద్ నగర ప్రతిష్టను పెంచారన్నారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరం చేయడంలో భాగంగా ఐటీ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించారని గుర్తు చేశారు. ప్రపంచాన్ని హైదరాబాద్ వైపు చూసేలా చేశారని, భాగ్యనగర కీర్తిని పెంచే ప్రయత్నంలో ఫార్మూలా ఈ –కార్ రేస్‌ను తెలంగాణ ప్రభుత్వం తరఫున నిర్వహించారని పేర్కొన్నారు. ఈ రేస్ ద్వారా హైదరాబాద్‌కు రూ.700 కోట్ల లబ్ధి చేకూరిందని.. ప్రభుత్వ అకౌంట్ నుంచి నిర్వహణ సంస్థకు నగదు పంపిణీలో ఎక్కడా కేటీఆర్ జోక్యం లేనప్పుడు అవినీతికి ఎలా పాల్పడ్డట్లు అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఇది కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రపూరిత కేసు మాత్రమేనన్నారు. ప్రశ్నిస్తున్నందుకే కేటీఆర్‌పై కేసులు పెడుతున్నారని. గతంలో పలు అంశాల్లో కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తామని అంటూ ప్రభుత్వంలోని మంత్రులు అనడం వారి కుట్రలకు నిదర్శనమని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment