అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేయాలి
● హనుమకొండ, వరంగల్ జిల్లాల
వ్యవసాయ అధికారులు రవీందర్, అనురాధ
మామునూరు: అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగుచేస్తే ఖర్చు లేకుండా అధిక దిగుబడి పొందవచ్చునని హనుమకొండ, వరంగల్ జిల్లాల వ్యవసాయ అధికారులు రవీందర్, అనురాధ సూచించారు. పత్తికట్టెతో కంపోస్ట్ తయారు చేసుకోవడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు. మామునూరు కృషి విజ్ఞాన కేంద్రంలో కోఆర్డినేటర్ డాక్టర్ రాజన్న అధ్యక్షతన అధిక సాంద్రత పత్తిసాగుపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. డాక్టర్ సీహెచ్. సౌమ్య, డాక్టర్ ఎ.రాజు, ఏఓలు హరి, రాకేశ్, విజయ్‌కుమార్, కేవీకే శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment