రెడ్డి సంఘం విభాగాలు ఏర్పాటు చేసుకుందాం
మడికొండ: రెడ్డి సంఘం యువజన, మహిళా విభాగాలను ఏర్పాటు చేసుకుందామని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. మడికొండలోని రెడ్డి కన్వెన్షన్ హాల్‌లో ఆదివారం వరంగల్ జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షుడు మాదిరెడ్డి రవీందర్‌రెడ్డి ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన సంఘం సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. సంఘం ఆశీ ర్వాదంతోనే ఎమ్మెల్యేగా గెలిచానని, మూడు నెలలకోసారి కాకుండా ప్రతి నెలా సమావేశం ఏర్పాటు చేసుకుని సంఘం అభివృద్ధికి కృషి చేద్దామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్‌రాంరెడ్డి, సంఘం సభ్యులు హనుమారెడ్డి, చాడా సునీల్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, పద్మనాభరెడ్డి, వసుందర, రాధికారెడ్డి తదితరులు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా సంఘం నూతన సంవత్సర డైరీ ఆవిష్కరించారు.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment