‘కాంప్లెక్స్’ అనుమతి రద్దు చేయాలి
వరంగల్: వరంగల్ లక్ష్మీపురంలోని ఆజంజాహి మిల్లు కార్మిక భవన స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఇచ్చిన అనుమతి రద్దు చేసి, నూతన భవనం నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఆజంజాహి మిల్లు కార్మిక భవన స్థల పరిరక్షణ కమి టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆది వారం కార్మిక భవనం కూల్చివేసిన స్థలంలో కమిటీ నిరసన తెలిపారు. ఈసందర్భంగా పరిరక్షణ కమి టీ నాయకుడు మాజీ మేయర్ టి.రాజేశ్వర్‌రావు, చెరువుల పరిరక్షణ సొసైటీ అధ్యక్షుడు పెరుమాళ్ల లక్ష్మణ్, కార్మికుడు అకెన వెంకటేశ్వర్లు మాట్లాడు తూ కార్మిక భవనాన్ని కూల్చివేసిన వారిపై, అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్య తీసుకోవాలని కోరారు. కూల్చివేసిన స్థలంలో నూతన కార్మిక భవన నిర్మాణంలో కోసం మంత్రి కొండా సురేఖ రూ.10 కోట్లు ప్రభుత్వం నుంచి మంజూరు చేయించాలని విజ్ఞప్తి చేశారు. కాశిబుగ్గ జేఏసీ కన్వీనర్ డాక్టర్ కొణతం కృష్ణ, ఇఫ్టూ జిల్లా అధ్యక్షుడు గంగు ల దయాకర్, వరంగల్ ప్రింటర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు అశోక్‌కుమార్, ఆజంజాహి మిల్లు కార్మిక కుటుంబాల సభ్యులు గంజి సాంబయ్య, చిమ్మని గోపి, గంగుల ప్రణయ్‌చందు, గూడూరు కృష్ణ, నున్నా అప్పారావు, సిరబోయిన రాజు, బజ్జూరి వీరేశం, ఎన్.వెంకటస్వామి, పిట్టల ఉపేందర్, మామిడి ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment