ఆక్రమణదారులపై చర్య తీసుకోవాలి
వరంగల్: వరంగల్ ఆజంజాహిమిల్ వర్కర్స్ యూనియన్ భవనాన్ని ఆక్రమించుకున్న వారితోపాటు అందుకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేంద్రకుమార్ కోరారు. ఈ మేరకు కలెక్టర్ సత్య శారద, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడేను శనివారం వారు కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సారయ్య మాట్లాడుతూ భవనాన్ని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని చిన్నవడ్డేపల్లి చెరువు, ఆక్రమణ ఏరియాల పరిరక్షణ సొసైటీ అధ్యక్షుడు పెరుమాళ్ల లక్ష్మణ్ ఈనెల 2న తనకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 1994 వరకు యూనియన్ ఆఫీస్ బేరర్లు మున్సిపల్ ఆస్తిపన్ను చెల్లించినట్లు రికార్డుల్లో నమోదై ఉందని పేర్కొన్నారు. గొట్టిముక్కల నరేశ్‌రెడ్డి నకిలీపత్రాలు సృష్టించి కొత్త ఇంటి నంబర్ తీసుకున్నాడని తెలిపారు. టౌన్‌ప్లానింగ్, టాక్సేషన్ విభాగం సాయంతో తప్పుడు మార్గంలో విక్రయించినట్లు చెప్పారు. రికార్డుల్లో ప్రముఖ వ్యాపారులకు అనుకూలంగా నమోదు చేయడంతో స్థానిక రౌడీలు జేసీబీతో రాత్రికి రాత్రే కూల్చివేసి, యూనియన్ కార్యాలయంలోని ఫర్నిచర్, ఫైళ్లను ఎత్తుకెళ్లారని తెలిపారు. ఈచర్యలకు పాల్పడిన వారితోపాటు నకిలీపత్రాలు సృష్టించేందుకు సహకరించిన మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. స్థలంలో యూనియన్ కార్యాలయాన్ని నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ అక్రమాలపై ముఖ్యమంత్రితోపాటు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినట్లు తెలిపారు.
ఏజే మిల్లు స్థలంలో యూనియన్
కార్యాలయాన్ని నిర్మించాలి
ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య,
కార్పొరేటర్ నరేంద్రకుమార్
కలెక్టర్ సత్య శారద, కమిషనర్
అశ్విని తానాజీ వాకడేకు వినతిపత్రాలు
Comments
Please login to add a commentAdd a comment