చర్చిలో చోరీకి పాల్పడిన దొంగ..
ధర్మసాగర్: మండలంలోని కరుణాపురం చర్చిలో చోరీకి పాల్పడిన దొంగను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కాజీపే ట మండలం కుమ్మరిగూడేనికి చెందిన కొత్తపల్లి స్వర్ణ డిసెంబర్ 10వ తేదీ నుంచి ధర్మసాగర్ మండలంలోని కరుణాపురం చర్చిలో ఉంటూ రోజూ ప్రార్థనల్లో పాల్గొంది. ఈ క్రమంలో డిసెంబర్ 30న తన శరీరంపై ఉన్న దాదాపు రూ. 2,22,500 వి లువైన బంగారు ఆభరణాలు చర్చి లోని బాత్ రూమ్ గోడపై పెట్టి స్నానం చేసింది. స్నానం చేసి న అనంతరం బయటకు వచ్చి గోడపై పెట్టిన బంగారు ఆభరణాలు చూడగా కనిపించలేదు. దీంతో ఆ చర్చికి వచ్చిన ప్రతీ ఒక్కరిని అడిగినా ఎవరూ తమకు తెలియదని చెప్పారు. ఈ ఘటనపై ఈ నెల 3న ధర్మసాగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి ఆ చర్చిలోని వ్యక్తులను విచారించారు. చర్చిలో పని చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన వంకాయలపాటి నరేశ్.. నాలుగు రోజులుగా కనిపించడం లేదని నిర్ధారణకు వచ్చి అతడి ఆచూకీ కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలో శనివారం నరేశ్ రాంపూర్ శివారులో తిరుగుతున్నాడనే సమాచారం మేరకు గ్రామం చేరుకుని అదుపులోకి తీసుకుని విచారించా రు. బంగారు ఆభరణాలను చోరీ చేశానని ఒప్పుకున్నాడు. దీంతో అతడి వద్ద ఉన్న బంగారు ఆభరణా లు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. సమావేశంలో ఎస్సై జానీ పాషా, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment