వ్యవసాయ మోటార్ల అంతర్‌జిల్లా దొంగల అరెస్ట్
గార్ల: వ్యవసాయ మోటార్ల చోరీకి పాల్పడుతున్న ముగ్గురు అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ చేసి 5 మోటార్లు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించినట్లు గార్లబయ్యారం సీఐ బి. రవికుమార్, ఎస్సై ఎస్‌కె. రియాజ్‌పాషా తెలిపారు. ఈ మేరకు శనివారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం మాదారం గ్రామానికి చెందిన ఈసం రాంబాబు, సీమల వెంకటేశ్వర్లు, ఈసం చుక్కయ్య ముఠాగా ఏర్పడి రాత్రి సమయాల్లో వ్యవసాయ మోటార్ల చోరీకి పాల్ప డుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని సేరిపురం సమీపంలో గుగులోత్ కిషన్‌కు చెందిన 2, గుగులోత్ చాంద్‌మల్‌కు చెందిన 3 మోటార్లను ఎత్తుకెళ్తూ పోలీసులను చూసి పారిపోతుండగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారించగా వ్యవసాయ మోటార్ల చోరీకి పాల్పడుతున్నామని నేరం ఒప్పుకున్నారు. దీంతో ముగ్గురిని అరెస్ట్ చేసి వారి నుంచి 5 మోటార్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ, ఎస్సై పేర్కొన్నారు. కాగా, నిందితులు కారేపల్లి, డోర్నకల్, బయ్యారం మండలాల్లో వ్యవసాయ మోటార్ల చోరీలకు పాల్పడిన ఘటనలో ఇటీవల 18 రోజులు జైలుకెళ్లొచ్చినట్లు సీఐ వెల్లడించారు. సమావేశంలో ఏఎస్సైలు రవీందర్, నూరుద్దీన్, సిబ్బంది తిరుమల్‌రావు, శ్యామ్, స్వప్న, శ్రీను, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
5 మోటార్లు, బైక్ స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment