స్వయం సహాయక సంఘాలకు ప్రోత్సాహం
హన్మకొండ అర్బన్: స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్‌లో వరంగల్, హనుమకొండ కలెక్టర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహిస్తే.. గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధి బలోపేతమవుతుందన్నారు. నియోజకవర్గంలో పాలసేకరణ కేంద్రాల ఏర్పాటు, మహిళా సంఘాల ద్వారా ఒక మెగావాట్ సోలార్ విద్యుత్ కేంద్రాల గుర్తింపు.. ప్రతీ మండలంలో 350 మందికి టైలరింగ్‌లో తర్ఫీదు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. మార్కెట్ డిమాండ్ మేరకు వస్తువులు తయారు చేసేలా శిక్షణ ఇవ్వాలని కోరారు. వీ హబ్ సీఈఓ సీత మాట్లాడుతూ.. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే వీ హబ్ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. మహిళలు ఇప్పుడు చేస్తున్న వ్యాపారాల అభివృద్ధికి తోడ్ప డడం, కొత్త రంగాల్లో గుర్తించి వాటికి సంబంధించి తర్ఫీదు ఇచ్చి ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. సమావేశంలో వరంగల్ కలెక్టర్ సత్యశారద, డీఆర్‌ఓ గణేశ్, హనుమకొండ ఆర్డీఓ నారాయణ, హనుమకొండ డీఆర్డీఓ శ్రీను, వరంగల్ డీఆర్డీఓ కౌసల్యదేవి, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
కలెక్టర్లతో సమావేశం
Comments
Please login to add a commentAdd a comment