గీసుకొండ: వరంగల్ జిల్లా సంఘం మండల శివారు స్టేషన్ చింతలపల్లికి చెందిన జవ్వాజి హేమలత తన కుటుంబ సభ్యులతో కలిసి గత డిసెంబర్ 30న ఇంటికి తాళం వేసి తిరుపతి వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు. స్వామివారి దర్శనం అనంతరం శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉండడాన్ని గమనించి గీసుకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటిలోని 4.8 తులాల బంగారు ఆభరణాలు, 35 తులాల వెండి, రూ.35 వేల నగదు, ఒరిజినల్ స్టడీ సర్టిఫికెట్లను గుర్తుతెలియని వ్యక్తులు దోచుకెళ్లినట్లు పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గీసుకొండ ఇన్‌స్పెక్టర్ మహేందర్ తెలిపారు.
ఇంటికి తిరిగి వచ్చేలోగా ఊడ్చేశారు!
● రూ.4.80 లక్షల నగదు,
20 తులాల బంగారం చోరీ
హసన్‌పర్తి: హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం విజయనగర్ నగర్‌కాలనీకి చెందిన సయ్యద్ ఖాజా ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటనలో సుమారు రూ.4.80 లక్షల నగదు, 20 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. సయ్యద్ ఖాజా నాలుగురోజుల క్రితం నయీంనగర్‌లో తనకున్న మరో ఇంటికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి శుక్రవారం సాయంత్రం ఇంటికి వచ్చారు. ఇంటి తాళాలు పగులగొట్టి, బీరువా ధ్వంసమై ఉంది. రూ.4.80 లక్షలతో పాటు బంగారు ఆభరణాలు కనిపించలేదు. సమాచారం అందుకున్న ఎస్సై రవీందర్ ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వేలిముద్రలు సేకరించి పోలీసు జాగిలాలతో గాలించారు.
తిరుపతికి వెళ్లొచ్చే సరికి ఇల్లు గుల్ల
4.8 తులాల బంగారం, 35 తులాల
వెండి, రూ.35 వేల నగదు అపహరణ
Comments
Please login to add a commentAdd a comment