టీపీజేఎంఏ క్రీడా పోటీలు ప్రారంభం
హసన్‌పర్తి: నగర శివారులోని ఎస్సార్ యూనివర్సిటీ మైదానంలో తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (టీపీజేఎంఏ) ఆధ్వర్యలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఈ పోటీలు కొనసాగనున్నాయి. టీపీజేఎంఏ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి వరంగల్, హనుమకొండ డీఐఈఓలు శ్రీధర్ సుమన్, గోపాల్ ముఖ్యఅతిథులుగా హాజరై క్రికెట్ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. క్రీడలతో మానసిక ప్రశాంతతతో పాటు శారీరక దృఢత్వం చేకూరుతోందన్నారు. పోటీల వల్ల స్నేహభావం పెంపొందుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ గౌర వ అధ్యక్షుడు, ఎస్సార్ యూనివర్సిటీ చైర్మన్ ఎ.వరదారెడ్డిని టీపీజేఎంఏ సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో ఏకశిల విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ తిరుపతిరెడ్డి, సంఘం సభ్యులు కుమార్, రాజు, అశోక్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment