శిక్షణ పొందిన కానిస్టేబుళ్ల మనోగతం
నా జీవితంలో మరువలేని ఘట్టం
టీజీఎస్పీ బెటాలియన్‌లో స్పెషల్ కానిస్టేబుల్‌గా శిక్షణ పొందడం నా జీవితంలో మరిచిపోలేని ఘట్టం. రైతు కుటుంబంలో పుట్టిన నేను.. నా కుటుంబ పోషణ కోసం ఎలాగైనా కానిస్టేబుల్ జాబ్ కొట్టాలనుకున్నాను. కష్టపడి సాధించి శిక్షణ పూర్తిచేశాను. ఇప్పుడు నా కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా ఉన్నారు.
– ఉదయ్‌కిరణ్, ఉట్కూర్, నారాయణపేట జిల్లా
నిబద్ధతతో పనిచేస్తా..
నాకు జాబ్ రావడంతో మా కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. మాది వ్యవసాయ ఆధారిత కుటుంబం. మా తల్లిదండ్రుల కష్టాలు తీర్చడానికి కానిస్టే బుల్ ఉద్యోగం సంపాదించాను. వృత్తి పట్ల నిబద్ధతతో పనిచేయడమే నా లక్ష్యం.
– వై.శ్రీనివాస్, కల్వకుర్తి, నాగర్ కర్నూల్ జిల్లా
మా నాన్నే నాకు ఆదర్శం
మా నాన్న హైదరాబాద్‌లో వ్యాపారం చేస్తుంటాడు. మా తల్లిదండ్రులు కష్టపడి నన్ను చదివించారు. మా నాన్నను ఆదర్శంగా తీసుకునే ఎలాగైనా జాబ్ సాధించాలనుకున్నాను. ఆయన ఆశయం నెరవేర్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది.
– పి.పాండు, రాయ్‌కోడ్, సంగారెడ్డి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment