కడియం శ్రీహరి పొద్దు తిరుగుడు పువ్వు
జనగామ: రాష్ట్ర రాజకీయాల్లో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పొద్దు తిరుగుడు పువ్వులా మారిపోయారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో పల్లా మాట్లాడుతూ రంగులు మార్చే ఊసరవెల్లి కడియంకు గోరీ కడతామని హెచ్చరించారు. ఏపార్టీ అధికారంలో ఉంటే అందులోకి పదవి పిచ్చితో మారే శ్రీహరికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఏమాత్రం సిగ్గూ, శరం ఉన్నా కేసీఆర్ పెట్టిన భిక్షతో ఎన్నికై న పదవికి వెంటనే రాజీనామా చేసి, తిరిగి పోటీ చేసి తన సత్తాను నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. కేసీఆర్, కేటీఆర్, కవితను విమర్శించే స్థాయి కాదని ఘాటుగా విమర్శించారు. ఇష్టం వచ్చినట్లు అవాక్కులు, చెవాక్కులు పలికితే కర్రుకాల్చి వాత పెడతామని శ్రీహరిని పల్లా హెచ్చరించారు. తన వ్యక్తిగతంగా వైద్యం విషయంలో నీలిమ ఆస్పత్రి ద్వారా వందలాది మందికి ఉచితంగా సేవలందిస్తున్నట్లు తెలిపారు. 40 ఏళ్ల రాజకీయం అంటున్న కడియం శ్రీహరి.. ఘన్‌పూర్‌కు ఒక్క డిగ్రీ కళాశాల కూడా తీసుకురాలేదని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేష్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ పోకల జమునలింగయ్య, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, నర్సింగరావు, మసిఉర్ రెహమాన్, గంగం సతీష్‌రెడ్డి, ముస్త్యాల దయాకర్, జూకంటి లక్ష్మి శ్రీశైలం, పేర్ని స్వరూప, బోడిగం జయప్రకాష్‌రెడ్డి, ముసిని రాజు, వేముల విద్యాసాగర్ గౌడ్, దేవునూరి సతీష్, తదితరులు ఉన్నారు.
ఏ పార్టీ అధికారంలో ఉంటే
అక్కడికి వెళ్తాడు
సిగ్గుంటే రాజీనామా చేయాలి
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment