సాగులో ఆధునిక పద్ధతులు పాటించాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద
వరంగల్: మిరప, పత్తి, పసుపు, మామిడి తదితర పంటల సాగులో రైతులు ఆధునిక పద్ధతులు పాటిస్తూ మంచి దిగుబడులు పొందాలని వరంగల్ కలెక్టర్ సత్య శారద సూచించారు. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పండ్ల మార్కెట్ వ్యాపారులు, మార్కెటింగ్ అధికారులు, ఉద్యాన శాఖ అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
ముసలమ్మకుంటలో మామిడి మార్కెట్
మార్కెట్ సమీప ముసలమ్మకుంట వద్ద ఉన్న మార్కెట్ స్థలంలో మామిడి మార్కెట్ ఏర్పాటు చేసేందుకు కావాల్సిన వసతులు కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అక్క డి మార్కెట్ స్థలం, గోదాం వద్ద ఉన్న మార్కెట్ స్థలాన్ని పరిశీలించారు. మార్కెట్ ప్రధాన కార్యాలయంలో వ్యాపారులతో సమావేశమై ఆమె మాట్లాడారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి నిర్మల, ఫ్రూట్ సెక్షన్ అధ్యక్షుడు వెల్ది సాంబయ్య, చ క్రధర్, హార్టికల్చర్ అధికారి రాకేశ్ తదితరులున్నారు.
జిల్లాను ప్రథమస్థానంలో నిలపాలి..
అధికారులు సమష్టిగా పనిచేసి జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని కలెక్టర్ సత్య శారద అన్నారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓలు, ఇతర అధికారులు, టీజీఓ, టీఎన్జీఓస్ నాయకులు గురువారం ఆమెను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment