విద్యారణ్యపురి: జిల్లాలో పదో తరగతి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాల సాధనే లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని అందుకు హెచ్‌ఎంలదే కీలకపాత్ర అని డీఈఓ వాసంతి అన్నారు. మంగళవారం హనుమకొండలోని డైట్ కళాశాలలో పదో బోధించే హెచ్‌ఎంలు, మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లతో సమీక్ష నిర్వహించారు. ఇందులో డీఈఓ వాసంతి మాట్లాడుతూ.. 40 రోజల ప్రత్యేక ప్రణాళికతో బోధన చేపట్టాలన్నారు. చాలా స్కూళ్లలో సిలబస్ పూర్తియినందున ప్రత్యేక ప్రణాళిక పునశ్చరణ తరగతులు ప్రారంభించాలని సూచించారు. ప్రతీ సబ్జెక్టు టీచర్ స్లిప్‌టెస్టులను కూడా నిర్వహించాలన్నారు. జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ ఎ.శ్రీనివాస్, డీసీఈబి కార్యదర్శి డాక్టర్ బి.రాంధన్, డైట్ అధ్యాపకులు ఎం.సోమయ్య ఎంఈఓలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment