తీన్మార్ నృత్యాలు.. కేక్ కటింగ్‌లు.. హ్యాపీ న్యూఇయర్ అంటూ కేకలతో నగరం మారుమోగింది. నగరవాసులు 2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. కాలేజీ హాస్టళ్లు, అపార్ట్‌మెంట్లలో చిన్నాపెద్దా తేడా లేకుండా ఆడిపాడారు. మంగళవారం రాత్రి 12 గంటలకు కేక్‌లు కట్ చేసి పంచిపెట్టారు. పలుచోట్ల బాణసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. నగరంలోని పలుచోట్ల జరిగిన ఈవెంట్లకు భారీ ఎత్తున హాజరయ్యారు.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్లు హన్మకొండ/వరంగల్
Comments
Please login to add a commentAdd a comment