తొమ్మిదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
● అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
ఎల్కతుర్తి : మండలంలోని వీరనారాయణపూర్‌కు చెందిన విద్యార్థి లోకిని రాము(15) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. రాము కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ఎస్సీ హాస్టల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఈక్రమంలో చదువు ఇష్టం లేక రెండు నెలల క్రితం హాస్టల్ నుంచి పారిపోయి వచ్చి ఇంటివద్దే ఉంటున్నాడు. రాత్రి సమయాల్లో ఇంట్లో చెప్పకుండా స్నేహితులతో కలిసి తిరుగుతున్నాడు. దీనిపై తల్లిదండ్రులు మందలించగా మనస్తాపానికి గురై సోమవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కుమారుడి మృతిపై అతడి స్నేహితులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వీణ వంక మండలం బేతిగల్లుకు చెందిన రాజు, హరికృష్ణపై అనుమా నం ఉందని పేర్కొంటూ మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మే రకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పులి రమేశ్ మంగళవారం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment