విద్యారణ్యపురి: జాతీయ విద్యా సంస్థలు ఐఐటీ, నిట్‌లలో ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్షలు జరగుతున్నాయి. హనుమకొండ, వరంగల్‌లో కలిపి 5 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. హనుమకొండలోని జయ ఇంజనీరింగ్ కళాశాల, హసన్‌పర్తిలోని ఆయాన్ డిజిటల్ జోన్, భీమారంలోని మోక్షిత కంప్యూటర్స్, భీమారంలోని చింతగట్టు టెక్నాలజీ సొల్యూషన్స్, వరంగల్‌లోని బొల్లికుంట ఇంజనీరింగ్ కళాశాలలో కేంద్రాలుగా ఉండగా పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈనెల 22, 23, 24, 28, 29, 30 తేదీల్లో పరీక్షలు జరగుతాయి. మొత్తం 7,542 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. తొలిరోజు బుధవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరిగిన సెషన్‌లో మొత్తం 1,252మంది అభ్యర్థులకు 1,220మంది హాజరుకాగా 32 మంది గైర్హాజరయ్యారు. రెండో సెషన్ పరీక్షలు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించారు. మొత్తం 1,259మంది అభ్యర్థులకు గాను 1,225మంది హాజరుకాగా 34 మంది గైర్హాజరయ్యారని జేఈఈ మెయిన్స్ సిటీ కోఆర్డినేటర్ కె. శ్రీలతారెడ్డి తెలిపారు. పరీక్షలకు నిర్దేశించిన సమయం కంటే రెండు గంటల ముందునుంచే కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతించారు. ఉదయం సెషన్‌లో 8.30 గంటలకు, మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్రాల గేట్లు మూసివేశారు. అభ్యర్థులు హాల్ టికెట్ అడ్మిట్‌కార్డుతోపాటు ఎన్‌టీఏ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన సెల్ప్‌డిక్లరేషన్, పాస్‌ఫొటో, ఒరిజనల్ గుర్తింపు కార్డులు పరిశీలించిన అనంతరమే అనుమతించారు.
తొలిసెషన్‌లో 1,220 మంది,
రెండో సెషన్‌లో 1,225 మంది హాజరు
Comments
Please login to add a commentAdd a comment