No Headline
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయంలో అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు దసరా శ్రీశరన్నవరాత్రి మహోత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆలయాన్ని సర్వాంగ సుదరంగా ముస్తాబు చేస్తున్నారు. వేడుకల్లో భాగంగా మూడో తేదీన ఉదయం 3 గంటలకు పెద్దమ్మ తల్లి అభిషేకంతో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 6 గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. 9 గంటలకు నవరాత్రి ఉత్సవ పూజలు ప్రారంభమవుతాయి. 10వ తేదీన చండీహోమం, 11న పూర్ణాహుతి, శ్రీలలితా సహస్రనామ పారాయణం, శ్రీలలితా సహస్రనామ కుంకుమార్చన నిర్వహిస్తారు. ప్రతిరోజూ రాత్రి 8 గంటలకు పెద్దమ్మ తల్లి ఉత్సవమూర్తి పల్లకీసేవ ఊరేగింపు, పవళింపు సేవ ఉంటాయి. అన్నప్రసాద వితరణ కూడా మధ్యాహ్నం ఒంటి గంటకు ఉంటుంది. శ్రీ అమ్మవారి దివ్యాలంకారాలను ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సాయంత్రం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శించుకోవచ్చని అధికారులు తెలిపారు. కాగా గురువారం నవరాత్రుల్లో తొలిరోజు అమ్మవారు శ్రీబాలాత్రిపురసుందరీదేవిగా, శుక్రవారం శ్రీగజలక్ష్మీదేవి, శనివారం శ్రీఅన్నపూర్ణాదేవి, ఆదివారం శ్రీగాయత్రీదేవి, సోమవారం శ్రీలలితాదేవి, మంగళవారం శ్రీరాజరాజేశ్వరీ దేవి, బుధవారం శ్రీసరస్వతీదేవి, గురువారం శ్రీ దుర్గాదేవి, శుక్రవారం శ్రీ మహిషాసురమర్దిని, శనివారం శ్రీ పెద్దమ్మతల్లిగా భక్తులకు దర్శనమిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment