No Headline
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
గోల్కొండ: ఫిట్‌నెస్‌పై అందరూ దృష్టి సారించాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. శుక్రవారం గోల్కొండ నయాఖీలాలోని హైదరాబాద్ గోల్ఫ్ కోర్సులో శ్రీనిధి యూనివర్సిటీ తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ ట్రోఫీని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. దేహ దారుఢ్యంపై శ్రద్ధ కనబరచాలని సూచించారు. తెలంగాణలో కొంత కాలంగా గోల్ఫ్ ఆటకు ఆదరణ పెరుగుతోందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. ఒకప్పుడు డంపింగ్ యార్డుగా ఉన్న ప్రదేశాన్ని రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటుతో హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ వారు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అత్యంత సుందరంగా గోల్ఫ్ కోర్సును సుందరంగా తీర్చిదిద్దడం ఎంతో ముదావహమన్నారు. మునుముందు కూడా ఈ గోల్ఫ్ కోర్సులో మరిన్ని అంతర్జాతీయ టోర్నీలు నిర్వహించే అవకాశం ఉందని గవర్నర్ అభిలషించారు. గోల్ఫ్ అసోసియేషన్‌కు చెందిన అజయ్‌కుమార్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment